అడక్కుండానే పానీ పూరి తెచ్చిన భర్త.. కోపంతో ఊగిపోయిన భార్య, చివరకు..

Pani Puri Was Ordered without Asking Wife Committed Lost Life In Pune - Sakshi

పూణే: చిన్న చిన్న విషయాలకు కూడా ఈ మధ్య చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడి విలువైన జీవితాలను అంతం చేసుకుంటున్నారు. అడగకుండానే పానీ పూరీని తీసుకువచ్చినందుకు భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. షోలాపూర్‌కు చెందిన గహినీనాథ్ సర్వదే 2019లో ప్రతిక్షను అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె భర్త పూణే లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వీరు పూణేలోని అంబేగావ్ పీఠభూమి ప్రాంతంలో నివసిస్తున్నారు.

కాగా వివాహమైనప్పటి నుంచి గహినీనాథ్ కు ప్రతీక్ష మధ్య చాల విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో గత శుక్రవారం గహినీనాథ్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పానీ పూరి తీసుకుని ఇంటికి వెళ్లాడు. అయితే తనను అడగకుండానే పానీ పూరిని తీసుకువచ్చినందుకు ప్రతీక్షకు కోపం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మరుసటి రోజు ప్రతీక్ష విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతిక్ష తండ్రి ప్రకాష్.. భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త గహినీనాథ్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: తల్లిదండ్రులు లేని జీవితంపై విరక్తితో తనువు చాలించిన యువకుడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top