తల్లిదండ్రులు లేని జీవితంపై విరక్తితో తనువు చాలించిన యువకుడు

Without Parents No Life: Young Man Self Slaughtered In Narmetta - Sakshi

పురుగుల మందు తాగి బలవన్మరణం

జనగామ జిల్లా బొమ్మకూర్‌లో విషాదం

నర్మెట: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా నర్మెట మండలంలోని బొమ్మకూర్‌లో మంగళవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కీ. శే. బండ రవి, బాలమ్మ దంపతులకు ఏకైక కుమారుడు బండ శ్రీకాంత్‌ (28). అతని తల్లిదండ్రులు మృతిచెందడంతో తనకున్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ, ట్రాక్టర్‌ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా గమనించిన చుట్టు పక్కల రైతులు చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top