చీరాలలో యువకుడి హత్య | The murder of a young man in chirala | Sakshi
Sakshi News home page

చీరాలలో యువకుడి హత్య

Jun 24 2024 4:13 AM | Updated on Jun 24 2024 4:13 AM

The murder of a young man in chirala

మృతుడు క్యాటరింగ్‌ షాప్‌ నిర్వాహకుడు  

చిన్న కారణానికే కత్తితో పొడిచిన వైనం  

నిందితుడు పండ్ల వ్యాపారి వద్ద పనిచేసే యువకుడు  

చీరాలటౌన్‌: చీరాలలో ఆదివారం దారుణహత్య జరిగింది. పండ్ల వ్యాపారి వద్ద పనిచేసే యువకుడు చిన్న కారణానికే కత్తితో పొడిచి క్యాటరింగ్‌ షాప్‌ నిర్వాహకుడు కంచర్ల సంతోష్‌ (36)ను హత్యచేశాడు. పట్టణ సీఐ పి.శేషగిరిరావు తెలిపిన వివరాల మేరకు.. కంచర్ల సంతోష్‌ (36) సంగం థియేటర్‌ సమీపంలో (ఖానాఖజానాలో) అయ్యప్ప క్యాటరర్స్‌ నిర్వహిస్తూ కర్రీ పాయింట్‌ కూడా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడ రోడ్డు మీద పండ్ల వ్యాపారాలు జరుగుతుంటాయి. 

ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పండ్ల వ్యాపారి చిన్న వద్ద పనిచేసే ఉమామహేశ్వరరావు తాగునీటి క్యాన్‌ను నీటితో కడిగాడు. ఆ నీరు ఎదురుగా ఉన్న అయ్యప్ప క్యాటరర్స్‌ ఖానాఖజానా దుకాణం వద్దకు చేరాయి. ఈ విషయమై కర్రీ పాయింట్‌లో పనిచేసే మహిళలు ఉమామహేశ్వరరావును ప్రశి్నంచారు. దీంతో అతడు వారిపై వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆ మహిళలు తమ యజమాని సంతో‹Ùకు సమాచారం అందించారు. 

అక్కడికి వచ్చిన సంతోష్‌ ఈ విషయమై ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఉమామహేశ్వరరావు పండ్లు కోసే కత్తితో సంతోష్‌ని పొడిచాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన సంతోష్‌ను స్థానికులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్‌ మృతిచెందాడు. మృతునికి భార్య, తల్లి ఉన్నారు. ఘటనాస్థలాన్ని, సంతోష్‌ మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. 

మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హత్యకు వినియోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉమామహేశ్వరరావును, పండ్ల వ్యాపారి చిన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం.  

Advertisement
 
Advertisement
Advertisement