మెదక్‌లో విషాదం.. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చి..

Medak:Two Brothers Died After Drowned In water - Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా హవేళి ఘనపూర్ మండలంలో విషాదం నెలకొంది. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చిన ఇద్దరు అన్నాదమ్ముళ్లు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు.

హవేళి ఘనపూర్ మండలంలోఅస్తికలు కలిపేందుకు నీటిలో దిగిన అన్నాదమ్ముళ్లు.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. జ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. కామారెడ్డి సరిహద్దు పోచారం ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులను కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఇనాం తండాకు చెందిన హర్యా, బాల్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top