వ్యాపారి హత్య కేసులో కోగంటి సత్యంకు రిమాండ్‌ | Koganti Satyam Remanded In Businessman Rahul Murder Case | Sakshi
Sakshi News home page

వ్యాపారి హత్య కేసులో కోగంటి సత్యంకు రిమాండ్‌

Aug 24 2021 7:25 PM | Updated on Aug 24 2021 7:52 PM

Koganti Satyam Remanded In Businessman Rahul Murder Case - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ఏ2 నిందితుడు కోగంటి సత్యంకు విజయవాడ 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.

సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ఏ2 నిందితుడు కోగంటి సత్యంకు విజయవాడ 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించేందుకు ఎర్పాట్లు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించారు. కోవిడ​ పరీక్ష అనంతరం నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా,    రాహుల్‌ హత్య తర్వాత రెండ్రోజుల పాటు పరారీలో ఉన్న కోగంటి సత్యంను విజయవాడ పోలీసులు నిన్న బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్ కూడా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. 


చదవండి: కామం మైకంలో ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్‌.. తెల్లారి లేచి చూస్తే

Advertisement
 
Advertisement
Advertisement