ప్రేయసి మైకంలో ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్‌.. తెల్లారి లేచి చూస్తే | Youth Found In Unconscious After Seal His Private Parts | Sakshi
Sakshi News home page

ప్రేయసి మైకంలో ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్‌.. తెల్లారి లేచి చూస్తే

Aug 24 2021 7:00 PM | Updated on Aug 24 2021 7:29 PM

Youth Found In Unconscious After Seal His Private Parts - Sakshi

అహ్మదాబాద్‌: ప్రేయసితో కలిసి ఉన్న మైకంలో ఆ యువకుడు తీవ్ర తప్పిదం చేశాడు. ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్‌ అంటించి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు. ఏమైందో తెలియదు గానీ తెల్లారి అతడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా మృతి చెందాడు. పోస్టుమార్టానికి తీసుకెళ్లగా సంచలన విషయాలు తెలిశాయి. గర్భం రాకుండా ప్రైవేటు పార్ట్‌కు రాసుకున్న డ్రగ్‌తో అతడు మృతి చెందాడని తేలింది. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్‌.. గంటల్లో)

గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని ఫతేవాడికి చెందిన ఓ యువకుడు (25) తన ప్రేయసిని కలిశాడు. వారిద్దరూ మరో మహిళతో కలిసి ఓ హోటల్‌కు వెళ్లి ఒక గది తీసుకున్నారు. అంతకుముందు వారిద్దరూ డ్రగ్స్‌ తీసుకున్నారు. అనంతరం ఆ మత్తు మైకంలో వారు శారీరకంగా కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సమయంలో సంరక్షణ మరిచారు.

గర్భం రాకుండా ఉండేందుకు ఎలాంటి వస్తువు తెచ్చుకోకపోవడంతో ఆ యువకుడు అక్కడే ఉన్న జిగురుతో పాటు వైట్‌నర్‌ అంటించుకున్నాడు. అనంతరం వారిద్దరూ కలుసుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకు అతడు అంబర్‌ టవర్‌ ప్రాంతంలో పొదల చాటున అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మృతదేహానికి సోలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా ఆ డ్రగ్‌ అతడికి తీవ్ర ప్రభావం చూపినట్లు తేలింది. 

అతడికి డ్రగ్స్‌ అలవాటు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ‘ఫోరెన్సిక్‌ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. ఏం జరిగిందో అందులో తెలుస్తుంది’ అని ఆ ప్రాంత డీసీపీ ప్రేమ్‌సుఖ్‌ డెలు తెలిపారు. ఈ ఘటన వైద్యులను నివ్వెరపరిచింది. సున్నితమైన అవయవాలకు ఇష్టమొచ్చినట్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పలువురు వైద్యులు హెచ్చరిస్తు‍న్నారు. కామం మైకంలో ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement