10 వేల మెట్లు, నలుగురు మనుషులు : భారీ కాయుడి డోలీ వీడియో వైరల్‌ | 4 men carry pilgrim up 10ksteps in Gujarat viral video sparks stop this practice debate | Sakshi
Sakshi News home page

10 వేల మెట్లు, నలుగురు మనుషులు : భారీ కాయుడి డోలీ వీడియో వైరల్‌

Jul 21 2026 1:15 PM | Updated on Jul 21 2026 3:10 PM

 4 men carry pilgrim up 10ksteps in Gujarat viral video sparks stop this practice debate

జమ్మూకాశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, కేరళలోని శబరిమల లాంటి భారతీయ పుణ్యక్షేత్రాలలో నడవలేని వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో ఉన్న భక్తులకు డోలీలు (Palkis/Palanquins) సేవ నిజంగా గొప్ప వరం. హిమాలయాల్లోని పవిత్ర స్థలాలు, కొండపై కొలువైన దేవాలయాలకు చేరుకోవడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి.  భక్తులు ఎంతో కొంత చెల్లించి, ఈ డోలీల ద్వారా దైవ దర్శనం చేసుకుంటారు. ఇది స్థానిక యువకులకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది కూడా. అయితే  మానవ పల్లకి, లేదా డోలీ సేవ ఇపుడు నెట్టింట చర్చల్లో నిలిచింది.ఎందుకంటే..

గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్న గిర్నార్ పర్వతంపై ఉన్న  ప్రముఖ దత్తాత్రేయ పీఠాన్ని దర్శించుకోవాలంటే   భక్తులు 10 వేల  మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలామంది ఇక్కడ  డోలీ సేవలను ఉపయోగించు కుంటారు. అలా ఒక భక్తుడిని తీసుకెళ్తున్న  నలుగురు వ్యక్తులు పల్లకి (డోలీ) లో మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ కాయంతో ఉన్న  అతడిని మోసుకుంటూ సన్నని మార్గంలో వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్న శారీరక శ్రమ, ఆయాసం చూసి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ వీడియోలో, తెల్లటి షర్టు, నల్లటి ప్యాంట్ ధరించిన ఒక భక్తుడిని నలుగురు డోలీ కార్మికులు మూదుల కర్రల సహాయంతో బ్యాలెన్స్ చేసుకుంటూ నిటారుగా ఉన్న రాతి మెట్లపై మోసుకెళ్తున్నారు.  ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్ల భిన్నాభిప్రాయాలు  వ్యక్తం చేశారు.  అలాగే ఈ ఘటన మానవులను మరో మానవుడు మోసే సాంప్రదాయంపై ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్‌ఫామెన్స్‌ బాలేదని పెయిడ్‌ లీవ్‌ : కంపెనీకి భారీ క్రేజ్‌

డబ్బు కోసం మనుషులను మోయడం సరైనది కాదని, కేవలం బద్ధకంతో లేదా సౌకర్యం కోసం యువకులు/ఆరోగ్యంగా ఉన్నవారు  కూడా ఈ సేవలను వాడుకోవడం సరికాదని, అమానవీయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు లేదా తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారికి మాత్రమే ఈ సేవలను అనుమతించాలని కొందరన్నారు. కేవలం బద్ధకంతో మనుషులను మోయించుకోవడం అస్సలు సరికాదు. నడవలేకపోతే ఇంట్లోనే ఉండొచ్చుగా అని మరికొందరు  నెటిజన్లు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్‌ కారు కావాలి

మరికొంతమంది  సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాంతాల్లో నివసించే ఎన్నో పేద కుటుంబాలకు ఈ పల్లకి సేవలే (డోలీ మోయడమే) ప్రధాన ఆదాయ వనరు. ఈ కష్టానికి గానూ వారు  భారీ మొత్తంలోనే వసూలు చేస్తారని , ఈ ప్రాక్టీస్‌ను పూర్తిగా నిషేధిస్తే వారి పొట్ట కొట్టినట్లవుతుందని కొందరు వాదించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement