breaking news
pallaki
-
10 వేల మెట్లు, నలుగురు మనుషులు : భారీ కాయుడి డోలీ వీడియో వైరల్
జమ్మూకాశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్, కేరళలోని శబరిమల లాంటి భారతీయ పుణ్యక్షేత్రాలలో నడవలేని వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో ఉన్న భక్తులకు డోలీలు (Palkis/Palanquins) సేవ నిజంగా గొప్ప వరం. హిమాలయాల్లోని పవిత్ర స్థలాలు, కొండపై కొలువైన దేవాలయాలకు చేరుకోవడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. భక్తులు ఎంతో కొంత చెల్లించి, ఈ డోలీల ద్వారా దైవ దర్శనం చేసుకుంటారు. ఇది స్థానిక యువకులకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది కూడా. అయితే మానవ పల్లకి, లేదా డోలీ సేవ ఇపుడు నెట్టింట చర్చల్లో నిలిచింది.ఎందుకంటే..గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్న గిర్నార్ పర్వతంపై ఉన్న ప్రముఖ దత్తాత్రేయ పీఠాన్ని దర్శించుకోవాలంటే భక్తులు 10 వేల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలామంది ఇక్కడ డోలీ సేవలను ఉపయోగించు కుంటారు. అలా ఒక భక్తుడిని తీసుకెళ్తున్న నలుగురు వ్యక్తులు పల్లకి (డోలీ) లో మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ కాయంతో ఉన్న అతడిని మోసుకుంటూ సన్నని మార్గంలో వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్న శారీరక శ్రమ, ఆయాసం చూసి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియోలో, తెల్లటి షర్టు, నల్లటి ప్యాంట్ ధరించిన ఒక భక్తుడిని నలుగురు డోలీ కార్మికులు మూదుల కర్రల సహాయంతో బ్యాలెన్స్ చేసుకుంటూ నిటారుగా ఉన్న రాతి మెట్లపై మోసుకెళ్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటన మానవులను మరో మానవుడు మోసే సాంప్రదాయంపై ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్If you don't have the health to go, why bother going??, better stay at home instead of using other fellow human like slaves 😡 pic.twitter.com/1iffGHX6su— BAKWAS FELLOW (@siva17subraman) July 20, 2026డబ్బు కోసం మనుషులను మోయడం సరైనది కాదని, కేవలం బద్ధకంతో లేదా సౌకర్యం కోసం యువకులు/ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఈ సేవలను వాడుకోవడం సరికాదని, అమానవీయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు లేదా తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారికి మాత్రమే ఈ సేవలను అనుమతించాలని కొందరన్నారు. కేవలం బద్ధకంతో మనుషులను మోయించుకోవడం అస్సలు సరికాదు. నడవలేకపోతే ఇంట్లోనే ఉండొచ్చుగా అని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలిమరికొంతమంది సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాంతాల్లో నివసించే ఎన్నో పేద కుటుంబాలకు ఈ పల్లకి సేవలే (డోలీ మోయడమే) ప్రధాన ఆదాయ వనరు. ఈ కష్టానికి గానూ వారు భారీ మొత్తంలోనే వసూలు చేస్తారని , ఈ ప్రాక్టీస్‌ను పూర్తిగా నిషేధిస్తే వారి పొట్ట కొట్టినట్లవుతుందని కొందరు వాదించారు. -
ఎవరు చెబితేనేమిటి?
కంచి పరమాచార్య జీవితంలో ఇదొక సంఘటన. ఆయన ఎక్కడికైనా వెళ్లాలంటే పల్లకిని ఉపయోగించేవారు. అలాగే ఓమారు ఆయన పల్లకిలో వెళ్తూ వెళ్తూ ఓ చోట పల్లకిని ఆపించి అందులో నుంచే ప్రసంగిస్తుండగా ఒకతను ఆయనను విమర్శించాడు. ‘‘ఇతరులు నలుగురైదుగురు మోస్తుండగా దర్జాగా పల్లకిలో కూర్చుని ప్రయా ణం చేస్తుంటారు. ఈయన సాధువేంటీ? ఓ మనిషిని మరొక మనిషి మోయడం తగునా! ఇది ఆయనకు తెలీదా? సాధువు అనే అతను అన్ని సుఖాలనూ త్యజించాలి కదా. ఎంత హీనమైన తంతిది. మరొకరి భుజాలపై ప్రయాణం చేసే ఈయనను సాధువని ఎలా అనుకోవాలి? ఈ పెద్దమనిషి మనకు హితవచనాలూ సామాన్య ధర్మాలు చెప్పడమా! అసలీయనకు ఏమర్హత ఉంది.. ఛీఛీ..’’ అని అన్నాడు. ఈ మాటలన్నీ పరమాచార్య చెవిన పడ్డాయి. మరుక్షణమే పరమాచార్య పల్లకిని నేల మీదకు దింపించి పల్లకిలోంచి ఇవతలకు వచ్చారు. ‘‘ఆయన చెప్పినదాంట్లో తప్పేముంది. సబబే కదా..’’ అని తన వెంట ఉన్నవారితో అన్నారు. అయితే పల్లకీ మోసిన వాళ్లు.. ‘‘ఎవరో ఏదో అన్నారని మీరిలా దిగడం మాకు బాధగా ఉంది. వాళ్ల మాటలను పెద్దగా పట్టించుకోకండి. మిమ్మల్ని మా భుజాలమీద తీసుకుపోవడం మా భాగ్యం’’ అన్నారు. అయినా పరమాచార్య తన మాట కొనసాగిస్తూ.. ‘‘ఆ మనిషి చెప్పింది నిజమే. సుఖాన్ని త్యజించని వారు సాధువెలా అవుతారు. నాకీ పల్లకి వద్దు. ఇక మీదట నేనెక్కడికి వెళ్లి నడచిపోతాను’’ అని ఓ గట్టి నిర్ణయానికి వచ్చారు. ఆ విధంగానే ఎక్కడి వెళ్లినా ఆయన నడిచే వెళ్తుండేవారు. పరమాచార్య చివరి వరకూ ఈ నిర్ణయం నుంచి తప్పుకోలేదు. – జగద్రేణు -
మల్లన్న చెంతకు చెంచులు
– గిరిజన చెంచులకు పూర్వవైభవం తెచ్చేలా ఈఓ కృషి – సౌకర్యాలు, దర్శనంలో ప్రాధాన్యత – చెంచులక్ష్మీ కల్యాణపథకం కింద ఘనంగా వివాహం – అర్చకత్వంలో శిక్షణ, భజన బందాలకు చేయూత దట్టమైన నల్లమల అటవీ కీకారణ్యం మధ్య నెలకొన్న శ్రీభ్రమరాంబాసమేత మల్లికార్జునస్వామివార్లను చెంచులు తమ దైవంగా భావించేవారు. తమకు పుట్టిన పిల్లలకు చెంచు మల్లయ్య, చెంచు మల్లమ్మ అని పేర్లు పెట్టుకునే వారు. పూర్వం మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామిఅమ్మవార్లకు తమ గిరిజన పద్ధతిలో కల్యాణోత్సవాన్ని నిర్వహించే వారని, అలాగే శ్రీభ్రమరాంబాదేవికి జరిగే కుంభోత్సవం పూర్తిగా చెంచు గిరిజనులకే ఒకప్పుడు పరిమితమైంది. కాలానుగుణ పరిస్థితులలో భాగంగా నాగరికత అభివృద్ధి చెందడంతో చెంచులను మల్లన్నకు నాగరీకులు దూరం చేశారని చెప్పవచ్చు. అయినప్పటికీ నేటికి స్వామివార్ల కల్యాణోత్సవ పల్లకీని ప్రతి నిత్యం మోసేది చెంచులే. అలాంటి చెంచులకు ఈఓ నారాయణభరత్ గుప్త మల్లన్న ఆలయంలో ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. – శ్రీశైలం శ్రీశైల మల్లన్నకు చెంచుల మధ్య అనుబంధాన్ని తెలుసుకున్న ఈఓ నారాయణ భరత్ గుప్త వారికి దేవస్థానం తరుపున గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఎల్. భాస్కరరావు, శివాజీస్ఫూర్తి కేంద్రం పర్యవేక్షకులు ఎ. వంశీకష్ణ, కర్నూలు జిల్లా సమరసత ఫౌండేషన్ కన్వీనర్ బాలిశెట్టి బాలసుబ్రమణ్యం, శ్రీశైల మండల ప్రతినిధి సంజీవరావులతో కలిసి వివిధ చెంచుగూడాలల చెంచు గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ చెంచులకు దేవస్థానం చేపట్టనున్న పలు అంశాలపై అవగాహన కల్పించారు. అవగాహన సదస్సుకు హాజరైన ప్రతి చెంచుగిరిజనుడికి ఈఓ నారాయణభరత్ గుప్త స్వామివార్ల లడ్డూ ప్రసాదాలు, శేషవస్త్రాలు, దివ్యపరిమళ విభూతి, శ్రీచక్రపూజ కుంకుమ, కైలాస కంకణాలను అందజేశారు. ఆ తరువాత స్వామివార్లకు అభిషేకం, స్పర్శదర్శనంతో పాటు అమ్మవారి దర్శనం, భోజన వసతి సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో దేవస్థానం వివిధ విభాగాల సిబ్బంది, స్వామివార్ల ప్రధానార్చకులు, అర్చకులు , కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల చెంచుగూడాల నుంచి వచ్చిన చెంచులు, పాల్గొన్నారు. చెంచులకు వర్థించే పథకాల వివరాలు: చెంచుల వివాహ సమయంలో దేవస్థానం స్వామిఅమ్మవార్ల ఆశీర్వచనంగా చెంచులక్ష్మీ కల్యాణ పథకం ప్రవేశపెడుతున్నారు. ఈ పథకంలో వివాహానికి దేవస్థానం కల్యాణమండపంతో పాటు వ««దlూవరులకు నూతన వస్త్రాలు, తాళిబొట్లు, మెట్టెలు అందజేస్తుంది. – వధూవరులతో వచ్చిన బంధువర్గానికి దేవస్థానం ఉచిత వసతి సదుపాయం, వివాహ భోజనం ఏర్పాటు చేస్తారు. – వివాహం రోజున నూతన వధూవరులచే స్వామివార్లకు అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించే అవకాశం. – ఈ సౌకర్యాలకు చెంచులు ఐటీడీఏను సంప్రదించాల్సి ఉంది. – ఆయా చెంచుగూడాలలోని ఆలయాలలో అర్చకత్వాన్ని నిర్వహింపజేసేందుకు ఆసక్తిగల చెంచులకు దేవస్థానం తరుపున తగిన శిక్షణ ఇస్తుంది. – చెంచుగూడాలలో భక్తులు, భజన బందాలు ఏర్పడితే అలాంటి బందాలకు హార్మోనియం, తబలా, భజన తాళాలు తదితర వాటిని దేవస్థానం సమకూరుస్తుంది. – దేవస్థానం నిర్వహించే కళా పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి రూ. 10వేలు, రెరండవ బహుమతి రూ. 8వేలు, మూడవ బహుమతి రూ. 5వేలు పారితోషికంగా అందజేస్తారు. పోటీలో పాల్గొన ప్రతి బందానికి రూ. 2వేలు ఇవ్వనున్నారు. – చెంచులు ఎప్పుడు ఆలయాన్ని సందర్శించినప్పటికీ వారికి ఉచిత దర్శనం కల్పిస్తారు. ఇందుకు ఐటీడీఏ ద్వారా గుర్తింపు పొందిన చెంచులు ఆ సంస్థ ద్వారా గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.


