కేరళ: వయనాడ్‌లో ఘోర ప్రమాదం | Kerala Wayanad Jeep Accident News Updates | Sakshi
Sakshi News home page

కేరళ: వయనాడ్‌లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

Aug 25 2023 7:28 PM | Updated on Aug 25 2023 7:46 PM

Kerala Wayanad Jeep Accident News Updates - Sakshi

మృతులంతా మహిళా కూలీలు కావడం గమనార్హం. మరో ఐదుగురి పరిస్థితి.. 

తిరువనంతపురం: కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. వయనాడ్‌లో ఓ జీప్‌ లోయలోకి దూసుకెళ్లి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఘటనలో డ్రైవర్‌ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

శుక్రవారం సాయంత్రం మనంథావాడీలో ఈ ఘోరం చోటు చేసుకుంది.  మృతులంతా వయనాడ్‌కు చెందిన వాళ్లని.. టీఎస్టేట్‌లో పని చేసే కూలీలుగా నిర్ధారణ అయ్యింది. 25 మీటర్ల లోయలో అతి వేగంగా జీపు పడడంతో.. అది రెండు ముక్కలైంది.  మృతదేహాలను వయనాడ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు.. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement