మహిళను చంపడానికి 1,400 కి.మీ ప్రయాణించి.. | how to bring block colour bottom of the photo in canva | Sakshi
Sakshi News home page

మహిళను చంపడానికి 1,400 కి.మీ ప్రయాణించి..

Jun 7 2026 3:17 PM | Updated on Jun 7 2026 4:51 PM

 how to bring block colour bottom of the photo in canva

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ దంపతులు ఢిల్లీలోని ఓ ప్రొఫెసర్‌ను హత్య చేసేందుకు 1,400 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దేబోస్మితా పాల్ హత్య కేసును పోలీసులు కేవలం 3 రోజుల్లో ఛేదించారు.

తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో ఉన్న సత్యం అపార్ట్‌మెంట్స్‌లో బుధవారం దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని బర్దమాన్ చేరుకుని రామ్‌ప్రసాద్ దాస్, బంశ్రీ దాస్‌ను అరెస్టు చేశారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. వారి మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దంపతులను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోరే అవకాశం ఉందని వారు తెలిపారు.

అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. నిందితులు బర్దమాన్ లో ఉంటారు. బాధితురాలిని కలవాలనే నెపంతో వారు ఢిల్లీకి వచ్చారు. 2022లో వివాహ జీవితం ప్రారంభమైన ఐదేళ్ల తరువాత దేబోస్మితా పాల్ తన భర్త నుంచి విడిపోయింది. ఆమె ఆ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉండగా, ఆమె భర్త బెంగళూరులో ఉన్నాడు.

బుధవారం నిందితులు మాస్కులు ధరించి ఆమె ఫ్లాట్‌కు వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వారు కొన్ని సంచులతో ప్రైవేట్ క్యాబ్‌లో వచ్చి, మెట్లు ఎక్కి 6వ అంతస్తుకు చేరుకున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు తమ మైనర్ కుమారుడిని కూడా వెంట తీసుకువచ్చారు. స్నేహపూర్వకంగా ఇంట్లోకి ప్రవేశించి, తమ వెంట తెచ్చుకున్న ఆయుధంతో ప్రొఫెసర్‌ను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు.

దుస్తులు మార్చుకున్న తరువాత సుమారు 30 నిమిషాలకే వారు తిరిగి వచ్చి, కింద వేచి ఉన్న క్యాబ్‌లో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సోర్సెస్‌ వెల్లడించాయి. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ప్రయాణ వివరాల ఆధారంగా ప్రయాణికుల గుర్తింపును పోలీసులు నిర్ధారించారు.

బుధవారం ఆ హౌసింగ్ సముదాయాన్ని సందర్శించిన 200 మందిలో 13 మందిని అనుమానితులుగా గుర్తించి ప్రశ్నించారు. 7 పోలీసు బృందాలు 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి, వందల మందిని విచారించాయి. దీంతో కేసు ఛేదించగలిగారు. చివరకు నిందితులను బర్దమాన్‌లో అరెస్టు చేసి విచారిస్తున్నారు.

ఎందుకు చంపారు? 
బాధితురాలికి పశ్చిమ బెంగాల్‌లో తన మాతామహుడి మరణం అనంతరం వారసత్వంగా వచ్చిన ఓ ఆస్తి ఉంది. దాన్ని విలువ కోట్లాది రూపాయలు. నిందితులు ఆ ఇంటిలో అద్దెదారులుగా ఉండేవారు. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇల్లు ఖాళీ చేయాలని దేబోస్మితా పాల్ వారిపై ఒత్తిడి తెస్తోంది. ఆస్తిని సొంతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెను హత్య చేయాలని దంపతులు పథకం రచించినట్లు అధికారులు తెలిపారు.

దేబోస్మితా సోదరి దేవరతి గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన సోదరి మృతిచెందినట్లు తెలిపింది. ఫ్లాట్‌కు బయట నుంచి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. సోదరికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో దేవరతి తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించింది.

లోపల దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ఆమె తలపై లోతైన గాయం, మణికట్టులో కోసిన రక్తనాళాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో నగలు, నగదు యథాతథంగా ఉండటంతో దోపిడీ ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement