సాక్షి,ఖమ్మం: వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. సింహాద్రి, సరోజినీ దంపతుల చిన్నారి కుమార్తె రమ్యశ్రీ (6) ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌లో పడి కన్నుమూసింది.
ఇంట్లో వంట పనులు జరుగుతున్న సమయంలో రమ్యశ్రీ పక్కనే ఆడుకుంటూ ఉండగా, జారి వేడి సాంబార్ పాత్రలో పడింది. తీవ్రంగా కాలిన గాయాలతో హహాకారాలు చేస్తున్న చిన్నారిని కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి చిన్నారిని హైదరాబాద్‌కు తరలించారు. మార్గం మద్యలో చిన్నారి కన్నుమూసింది.
ఈ ఘటనతో ఇందిరమ్మ కాలనీ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తల్లిదండ్రుల ఆవేదన చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.


