‘వాగు’లో గల్లంతైన నలుగురి మృతి | Four people lost in the river and died | Sakshi
Sakshi News home page

‘వాగు’లో గల్లంతైన నలుగురి మృతి

May 31 2024 5:42 AM | Updated on May 31 2024 5:42 AM

Four people lost in the river and died

మృతదేహాలకు పోస్టుమార్టం 

కుటుంబ సభ్యులకు అప్పగింత 

బాపట్లటౌన్‌: విహారయాత్రలో భాగంగా హైదరా­బాద్‌ నుంచి బాపట్ల ప్రాంతానికి వచ్చిన 12 మందిలో బుధవారం నల్లమడవాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సునీల్‌­కుమార్‌ (36), అతని కొడుకు అనురాజ్‌ (13) మృతదేహాలు బుధవారం రాత్రి ఏరియా వైద్యశా­లకు తరలించారు. 

మరో ఇద్దరు ఆచూకీ లభించకపోవడంతో జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌జిందాల్‌ ఆదేశాల మేరకు రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్, సూర్యలంక తీరంలోని గజ ఈతగాళ్లు, అగ్నిమాపక అధికారులు టీమ్‌లుగా ఏర్పడి నల్లమడ వాగులో సుమారు 3 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా వడ్లకొండ కిరణ్‌గౌడ్‌ (35) మృతదే­హాన్ని గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తించి వెలికి తీశా­రు.

 అదే సమయంలో బండా నందు (35) మృతదేహం మూలపాలెం గ్రామ­శివారులోని తుమ్మ­చెట్ల మధ్యలో ఉన్న­ట్లు గుర్తించి వెలికి తీశారు. నలుగురు మృతదేహాలకు గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్‌ సీఐ శ్రీహరి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement