వరకట్న వేధింపులతో వివాహిత బలవన్మరణం

Forced death of a married woman with dowry harassment - Sakshi

బంధువుల దాడిలో భర్త మృతి– నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ఘటన

అచ్చంపేట: వరకట్న వేధింపులతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడగా.. యువతి తరఫు బంధువులు ఆగ్రహంతో భర్త పై దాడి చేయడంతో మృతిచెందాడు. ఘటనకు సంబంధించి వివరాలు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన అతికారి సింధు (26), ఖమ్మం జిల్లాకు చెందిన నిమ్మతోట నాగార్జున (28) అచ్చంపేట ప్రగతి డిగ్రీ కళా శాలలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు.

పెద్దలను ఎదిరించి 2021 మార్చిలో హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగార్జున అచ్చంపేటలోని తన బాబాయ్‌ డాక్టర్‌ కృష్ణకు చెందిన శ్రీరాంసర్రాం ఆస్పత్రి లో పనిచేస్తున్నాడు. కొంతకాలం వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో గొడ వలు మొదలయ్యాయి. దీంతో కొద్ది రోజులుగా కట్నం తీసుకురావాలని సింధును నాగార్జున, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సింధు తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయతి్నంచింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీరాంసర్రాం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నాగర్‌కర్నూల్‌కు, అక్కడి నుంచి మహబూబ్‌నగర్, చివరికి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. అయితే అప్పటికే సింధు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  

మృతదేహం తీసుకువస్తుండగా.. 
కాగా, సింధు మృతదేహాన్ని భర్త నాగార్జున అ చ్చంపేటకు తీసుకొస్తుండగా ఆమన్‌గల్‌ సమీపంలో బంధువులు వాహనాన్ని అడ్డగించి నాగార్జునను మరో వాహనంలో తీసుకెళ్లి చితకబాది అచ్చంపేట తీసుకొచ్చారు. అప్పటికే పోలీసులకు విషయం తెలియడంతో సింధు బంధువుల వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన నాగార్జున మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు.

సింధు, నాగార్జున మృతదేహా లు ఒకే దగ్గర ఉంటే అల్లర్లు జరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు సింధు మృతదేహాన్ని అచ్చంపేట ఆస్పత్రికి, నాగార్జున మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా తమ కూతురు మృతికి డాక్టర్‌ కృష్ణ, అతని భార్య, నాగార్జున తల్లి, చెల్లి కారణమని సింధు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు.

నాగార్జున బాబాయ్‌ డాక్టర్‌ కృష్ణ వరకట్నం డబ్బులు తేవాలని.. లేకపోతే తన కోరిక తీర్చాలని సింధుని వేధించినట్లు పోలీసులకు శనివారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సింధుది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆస్ప త్రుల చుట్టూ తిప్పారని వారు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి, అచ్చంపేట సీఐ అనుదీప్, ఎస్‌ఐ గోవర్ధన్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top