భార్య వివాహేతర సంబంధం.. భర్త అడ్డుగా ఉన్నాడని.. | Extra Marital affair: Wife Assassinated Husband In Nizamabad | Sakshi
Sakshi News home page

భార్య వివాహేతర సంబంధం.. భర్త అడ్డుగా ఉన్నాడని..

Feb 13 2022 3:15 PM | Updated on Feb 13 2022 4:01 PM

Extra Marital affair: Wife Assassinated Husband In Nizamabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మద్నూర్‌(నిజామాబాద్‌): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన ఘటన మండలంలోని పెద్ద ఎక్లారలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై శివకుమార్, గ్రామస్తులు శనివారం తెలిపిన వివరాలు.. బిచ్కుంద మండలం కందర్‌పల్లికి చెందిన ఫిరంగి సాయిలు(35)కు 16 ఏళ్ల క్రితం మండలంలోని పెద్ద ఎక్లారకు చెందిన రుక్మిణితో వివాహం జరిగింది. డిసెంబర్‌లో రుక్మిణి తల్లి మరణించింది. అప్పటి నుంచి సాయిలు తన భార్యతో కలిసి అత్తగారింటి వద్దే ఉంటున్నాడు. అయితే రుక్మిణి గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన బంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను చంపించింది.

ఈ ఘటన డిసెంబర్‌లో చోటు చేసుకుంది. సాయిలు మృతదేహాన్ని వ్యవసాయ భూమిలో పాతిపెట్టారు. తన కొడుకు కనబడకపోవడంతో సాయిలు తల్లి బషవ్వ తెలిసిన వారి వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే సాయిలును హత్య చేసిన వారిలో ఓ నిందితుడు మద్యం తాగి శనివారం హత్య గురించి చెప్పినట్లు తెలిసింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, ఇన్‌చార్జీ సీఐ మురళీ పెద్ద ఎక్లారలో విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించారు. ఆదివారం మృతదేహాన్ని వెలికి తీయనున్నట్లు తెలిసింది.   

Advertisement
 
Advertisement
Advertisement