పెళ్లైన యువతికి మాజీ ప్రియుడు వేధింపులు | Ex boyfriend troubles a married woman In Vijayawada | Sakshi
Sakshi News home page

పెళ్లైన యువతికి మాజీ ప్రియుడు వేధింపులు

Oct 4 2026 9:23 PM | Updated on Oct 4 2026 9:23 PM

Ex boyfriend troubles a married woman In Vijayawada

విజయవాడ:  పెళ్లైన యువతిని మాజీ ప్రియుడు వేధింపులకు గురి చేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. నెల రోజుల నుంచి తనను కలవాలంటూ యువతిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు మాజీ ప్రియుడు. ఈ క్రమంలోనే ఆ యువతితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాతో పాటు యువతి భర్తకు పంపాడు. 

తన భార్యతో వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోస్, వీడియోస్ బయటకి రావడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు భర్త.  ఈ విషయాన్ని సదరు యువతి కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు యువకుడిపై దాడికి ప్లాన్‌ చేశారు. 

ఈ క్రమంలో  విజయవాడకు రప్పించింది యువతి.  విజయవాడకు వచ్చిన యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు పివిపి మాల్స్ సమీపంలో దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడ్ని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. 

ఇదీ చదవండి: తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement