426 నామినేషన్ల దాఖలు | - | Sakshi
Sakshi News home page

426 నామినేషన్ల దాఖలు

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

ఆదివారం రెండు డివిజన్లలో

నామినేషన్ల పర్వం

182 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు

సర్పంచ్‌కి 178, వార్డుసభ్యుల స్థానాలకు 248 నామినేషన్ల దాఖలు

చిత్తూరు కార్పొరేషన్‌ : జిల్లాలోని పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్ల పరిధిలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ఆ రెండు డివిజన్ల పరిధిలో ఆదివారం సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు రెండు డివిజన్లలోని 9 మండలాలు, 182 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 426 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ ప్రకటించారు. ఇందులో సర్పంచ్‌కి 178, వార్డు సభ్యుల స్థానాలకు 248 నామినేషన్లు అందినట్లు తెలిపారు.

కుప్పం డివిజన్‌లో అధికం

పలమనేరు డివిజన్‌తో పోలిస్తే కుప్పం డివిజన్‌లోని నాలుగు మండలాల పరిధిలో 92 పంచాయతీలకు గాను అధికంగా మొదటి రోజు నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌ స్థానాలకు 136, వార్డు సభ్యులకు 151 మొత్తం 287 నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పలమనేరు డివిజన్‌లోని ఐదు మండలాల పరిధిలో 90 పంచాయతీలకు నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌ స్థానాలకు 42, వార్డు సభ్యులకు 97 మొత్తం 139 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.

పోటీ ఎక్కువగా ఉన్న పంచాయతీలు

కుప్పం డివిజన్‌లోని గుడుపల్లె మండలం, పెద్దబడనవాడ పంచాయతీలో అత్యధికంగా ఏడు సర్పంచ్‌ నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత కుప్పం మండలం, మల్లనూరు, రామకుప్పం మండలం, విజులపురం, పెద్దపంజాణి మండలం, కరసనపల్లె పంచాయతీల్లో ఐదు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. రామకుప్పం పెంచనబల్ల, కొంగనపల్లె, దండికుప్పం, ఎంకేపురం, ఐవీమిట్టపల్లె, పెద్దకుంట పంచాయతీల్లో నాలుగు చొప్పున సర్పంచ్‌ నామి నేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.

వార్డులో మల్లనూరు అధికం

కుప్పం మండలం, మల్లనూరులో 10 వార్డులకుగాను 19 నామినేషన్లు నమోదయ్యాయి. బైరెడ్డిపల్లె మండలం లక్కనపల్లెలో 15, రామకుప్పంలో 14, బైరెడ్డిపల్లెలో 13, పెంచనబల్లలో 11, కొంగనపల్లె, కంభంపల్లెలో 10 చొప్పున వార్డు నామినేషన్లు నమోదు చేశారు. కుప్పం, పలమనేరు డివిజన్లలోని అన్ని క్లస్టర్‌ నామినేషన్‌ కేంద్రాల్లో రిట్నరింగ్‌ అధికారులు నోటీసులు జారీచేసి నామినేషన్లు స్వీకరించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

తొలి దశ పంచాయతీ సమరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement