ఉత్సాహంగా జిల్లాస్థాయి పారా స్పోర్ట్స్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా జిల్లాస్థాయి పారా స్పోర్ట్స్‌ ఎంపికలు

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

పోటీల్లో పాల్గొన్న 42 మంది దివ్యాంగ క్రీడాకారులు ఆరు విభాగాల్లో ప్రతిభ చాటిన బాలురు, బాలికలు నవంబర్‌ 30 నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి ఎంపికలు

చిత్తూరు కలెక్టరేట్‌ : దివ్యాంగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్‌, గేమ్స్‌ ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని మెసానిక్‌ మైదానంలో ఉదయం 9.00 గంటలకు ప్రారంభమైన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగ క్రీడాకారులు ఉత్సాహంగా తరలివచ్చారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో మొత్తం 42 మంది దివ్యాంగ క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 27 మంది బాలురు, పురుషులు ఉండగా, 15 మంది బాలికలు, మహిళలు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపిస్తూ క్రీడాకారులు పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement