గంగవరం: ద్విచక్ర వాహనాన్ని ఐషర్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని బండమీదజరావారిపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్(32), రాజేంద్ర(31) ఇద్దరూ మేసీ్త్ర పనిచేసి జీవనం సాగిస్తున్నారు. ఇద్దురూ కలిసి ద్విచక్ర వాహనంలో సోమవారం ఉదయం కూలి పనికి వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి చేరుకునే క్రమంలో గ్రామానికి సమీపంలోని ఓ మామిడి తోపు వద్ద మలుపు వద్ద ఐషర్ వాహనం ఎదురుగా వస్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సోమశేఖర్‌కు తీవ్రగాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


