వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకుడు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకుడు

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

బైరెడ్డిపల్లె : మండలంలోని చిక్కనపల్లె గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మునిరత్నం ఆదివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఆయనకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. క్రిష్ణమూర్తి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఎన్ని దౌర్జన్యాలు, దాడులు చేసినా పల్లెపోరులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు సత్తా చాటడం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు. రెండున్నరేళ్లలో వృద్ధులకు ఒక్క పింఛను కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు.

నేడు కలెక్టరేట్‌లో

పీజీఆర్‌ఎస్‌ రద్దు

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్‌ కోడ్‌) అమలులో ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తుండడంతో పీజీఆర్‌ఎస్‌ రద్దు చేశామన్నారు. డిసెంబర్‌ 3 వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందన్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యం

తిరుపతి రూరల్‌ : ఆరోగ్యమే మహా భాగ్యమని పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ఉమ తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఆదివారం ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించే లక్ష్యంతో 98వ ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సైక్లింగ్‌, యోగా, జుంబా తదితర వ్యాయామ కార్యక్రమాలు చేపట్టారు. నిర్వాహకులు శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణలో నిత్య వ్యాయామం ప్రాధాన్యతను వివరిచారు. రోజువారి జీవితంలో శారీరక శ్రమకు ప్రాధాన్యమిస్తూ ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరుచుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement