సృష్టికే మార్గదర్శి గురువు | - | Sakshi
Sakshi News home page

సృష్టికే మార్గదర్శి గురువు

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): అవనికే ప్రణవరూపంగా, సృష్టికే మార్గదర్శిగా గురువు పాత్ర అద్వితీయమని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షుడు తోట గోవిందన్‌ తెలిపారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు భవనంలో ఆదివారం సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు విద్యార్థిలోకానికి విశిష్ట సేవలందించిన బోధనా బృందానికి గురుజ్యోతి జాతీయ పురస్కారాలు–2026 దేవేంద్రరావు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తోట గోవిందన్‌ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌కు గురు వు ప్రతి రూపమని, గురుపీఠానికి మంగళహారతులు పట్టిన రోజున ఈ ప్రపంచంలో మానవత్వం పరిమళిస్తుందన్నారు. ప్రముఖ రచయితలు జి.శాంతకుమారి, గొడుగుచింత గోవిందయ్య, రెడ్డిపల్లి షాజహాన్‌ మాట్లాడాతూ సకలశాస్త్రాల గురువు లక్షణాలను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్‌.యువన్య, కె.విమల, డా.కొఠారి వేంకటరత్నం, ఎస్‌.ము నీంద్ర, సుందరం మాస్టారు, పాడి రమేష్‌ బాబు, సతీ ష్‌, సాహితీకారులు వి.ఉషాకిరణ్‌, కీర్తిప్రియ, రమ్య, యమున, రోహిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement