గ్రామానికి చెందిన వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, ఓ మహిళ మృతి చెందడంతో గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి మృతదేహాలు గుర్రంకొండవాండ్లఊరుకు చేరుకున్నాయి. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బోరున విలపించారు. మృతి చెందిన వారందరూ వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే. ఆ దేవదేవుడైనా వారిని కాపాడలేక పోయాడా..? అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మృతులకు అంతిమ సంస్కారాలు చేపట్టనున్నారు.


