పోటీలో రూ.కోట్లకు పడగెత్తిన ఆ నలుగురు
కొంగుచాటు కృష్ణుడు చక్రం తిప్పడమే లక్ష్యం
ప్రధాన బరిలో బిల్డర్, విద్యాసంస్థల అధినేత
జెడ్పీ కుర్చీ
జిల్లా ప్రజాపరిషత్ పీఠం భలే ఖరీదైపోయింది. ఏకంగా రూ.70 కోట్లు పలుకుతోంది. దానికి మించి కూడా సమర్పించుకునేందుకు కూటమి నేతలు సిద్ధమైపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మాఫియా సామ్రాజ్యంలో కోట్లకు పడగెత్తేశారు. ఇసుక, మట్టి, గ్రావెల్, కంకర ఇష్టారాజ్యంగా దోచేసి జేబులు నింపుకున్నారు. ఆ అక్రమ సంపాదనంతా వెచ్చించి జెడ్పీ కుర్చీ కొనేసేందుకు సిద్ధమైపోయారు. బిల్డర్, విద్యాసంస్థల అధినేత ప్రధాన బరిలో నిలిచినట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సాక్షి, చిత్తూరు: జిల్లా ప్రజాపరిషత్ పీఠంపై రూ.కోట్లకు పడగెత్తిన పచ్చనేతల మధ్య పోటీ నడుస్తోంది. ఎంతలా అంటే.. జెడ్పీ కుర్చీని దక్కించుకోవడానికి ఏకంగా రూ.70 కోట్లు ఇచ్చుకోవడానికి కూడా సై అంటే సై అంటున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఎంపిక గడువు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది.
కుఠిలత్వంతో గెలిచినా..
ప్రాదేశిక ఎన్నికలు ఆరంభమైంది మొదలు.. పోలింగ్.. ఫలితాలు వెల్లడించేంత వరకు అధికార పార్టీ నేత లు చేసిన అరచకాలు, విధ్వంసకాండ దాడుల ను చూ సి జిల్లా ప్రజానీకం నివ్వెరపోయింది. ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెట్టి, పూతలపట్టు నియోజకవర్గంలోని మూడు మండలాలను ఏకగ్రీవం చేసుకోవడం, రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల్లో నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకోవడం అంత త్వరగా మరిచిపోయే విషయం కాదు. 24 మండలాల్లో జరిగిన జెడ్పీ టీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో అత్యధిక స్థానా లు గెలుచుకుని వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేశా రు. అయినాసరే పోలీసులు,రిటర్నింగ్ అధికారుల అండదండలతో టీడీపీ అభ్యర్థులు, నేతలు రిగ్గింగ్, దొంగ ఓట్లతో 20 స్థానాలను ఆ పార్టీ కై వసం చేసుకు న్న విషయం విఽధితమే. తాజాగా జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక సమీపించడంతో కేవలం డబ్బులను వెదజల్లడ మే ఫా ర్ములాగా నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం చేయడానికి పచ్చ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.
ఆ నలుగురిలో ఇద్దరి మధ్యే పోటీ
చైర్‌పర్సన్ కుర్చీ జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ప్రధానంగా టీడీపీలోని ప్రధాన సామాజికవర్గ నేతల మధ్య పోటీ నెలకొంది. బంగారుపాళ్యం, పూతలప ట్టు, గుడిపాల, పాలసముద్రం నాయకుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే ఈ నాలుగు మండలాల నుంచి పూతలపట్టు జెడ్పీటీసీ శైలాజ, గుడిపాల జెడ్పీటీసీ మమతశ్రీ పోటీలో ఉన్నారు. ఒకరు సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి విద్యను అమ్ముకుని రూ.వందల కోట్లకు పడగెత్తగా.., మరొకరు బంగారుపాళ్యం నుంచి బెంగళూరు వెళ్లి రూ.వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరి సతీమణి జెడ్పీపీఠంపై కూర్చోబెట్టి మొత్తం పెత్తనం చెలాయించొచ్చనే ధీమాతో వారి పతులు భావిస్తున్నారు. దశాబ్దం క్రితం అప్పటి టీడీపీ నేత తన భార్యను చైర్‌పర్సన్‌గా కూర్చోబెట్టి కొంగుచాటి కృష్ణుడిగా చక్రం తిప్పిన విధానాన్ని ఇప్పుడు పోల్చుకుంటూ తామేమీ తక్కువ కాదన్నట్టుగా పావులు కదుపుతున్నారు. ఒకరూ పెదబాబు నుంచి హామీ లభించిందని ప్రచారం చేసుకుంటుండగా, తనకు చినబాబు హామీ ఇచ్చారని మరొకరు చెబుతున్నారు. అవసరమైతే జెడ్పీటీసీకి రూ.కోటి ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదు.
జిల్లాను చుట్టేద్దామనే?
రూ.కోట్లు వెచ్చించి కుర్చీ కొనడానికి సిద్ధమవుతున్న అధికార పార్టీ నేతల ప్రధాన లక్ష్యం అంతకంత రెట్టింపు లాభాలు రాబట్టడానికి అనే విషయం బహిరంగ రహస్యం. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 66 మండలాలు ఉండగా పునర్విభజన పుణ్యమా అంటూ ఈ సంఖ్య 27కు చెందిన విషయం తెలిసిందే. అయినా సరే ఈ ఆట రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టొచ్చని ఎటు లేదన్నా రూ.20 – 30 కోట్ల మధ్య కమీషన్లు దండుకోవచ్చని సూత్ర అభిప్రాయంలో ఉన్నారు. ఈ లెక్కన ఐదేళ్లు పీఠంలో కూర్చుంటే రూ.100 కోట్లకు పైనే రాల్చుకోవచ్చని అంచనాలు వేసేసుకుంటున్నారు. దీనికి తోడు జెడ్సీ వైస్ చైర్మన్ పోస్టుకు సైతం బాగా డిమాండ్ నెలకుంది. అధికార దర్పం ప్రదర్శించడంతోపాటు ప్రొటోకాల్ గుర్తింపు ఉండడం, చైర్‌పర్సన్ మహిళ కావడంతో జెడ్పీలో తమపట్టు కొనసాగించవచ్చనే ధీమా పచ్చనేతల మధ్య నెలకొంది.
రూ.కోట్లు పలుకుతున్న
జెడ్పీ పీఠం


