ఆరోగ్యశాఖ ఉద్యోగులంటే అలుసా? | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశాఖ ఉద్యోగులంటే అలుసా?

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

● తిరుమలలో భక్తి, చరిత్ర, కళలు, ఆధునిక సాంకేతికతల సమ్మేళనం ● నేటినుంచి సందర్శకులకు అనుమతి

చిత్తూరు రూరల్‌(కాణిపాకం): వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలంటే అధికారులకు అంత అలుసా అని పబ్లిక్‌ హెల్త్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కార్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం చిత్తూరులోని ఓ ప్రైవేటు భవనంలో ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, వివిధ కేడర్ల సంఘాలు చేస్తున్న సమ్మెలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సెప్టెంబర్‌ 17న సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సుమారు 30 సమస్యలపై చర్చించినా, ఇప్పటికీ ఒక్క ఉత్తర్వు కూడా రాలేదని అసంతృపి్‌త్‌ వ్యక్తం చేశారు. సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. ఓటీపీ ఆధారిత సర్వేలను రద్దు చేయాలని, ఫీల్డ్‌ సిబ్బందిపై యాప్‌ల భారం తగ్గించి ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సచివాలయ ఏఎన్‌న్‌ఎంలను పూర్తిగా ఆరోగ్య శాఖ పరిధిలోకి తెచ్చి 35 సీఎల్‌లు అమలు చేయాలని, సీహెచ్‌ఓలను పీహెచ్‌ఓలుగా, స్టాఫ్‌ నర్సులను నర్సింగ్‌ ఆఫీసర్లుగా మార్చాలన్నారు. అర్హులైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించి బదిలీ సౌకర్యం కల్పించాలని, రెండవ ఏఎన్‌ ఎంలకు సమాన వేతనం ఇవ్వాలని, 2004కు ముందు నియమితులైన వారికి పాత పెన్షన్‌ వర్తింపజేసి ఫీల్డ్‌ సిబ్బందికి అలవెన్సులు ఇవ్వాలని తీర్మానించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎ.లక్ష్మీనారాయణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బి.శ్రీనివాస్‌మూర్తి, కార్యదర్శిగా కె.ఆర్‌.జ్ఞానశేఖర్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా కె.భానుప్రకాష్‌, కోశాధికారిగా జె.చంద్రశేఖర్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీకాంత్‌ రాజు, రమణ, బాబాసాహెబ్‌, తాలూకా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

భక్తి, విజ్ఞాన సంగమం.. ఎస్వీ మ్యూజియం

తిరుమల: శ్రీవారి క్షేత్ర చరిత్ర, భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాల వైభవం నేటినుంచి తిరుమలలో భక్తుల కళ్లముందు సాక్షాత్కరించనుంది. టీటీడీ ఆధ్వర్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ సాంకేతిక సహకారంతో ఆధునికీకరించిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం (ఎస్వీ మ్యూజియం)లోకి నేటి (సోమవారం) నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. సెప్టెంబర్‌ 16న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మ్యూజియంను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగంతస్తుల్లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో 14 ప్రత్యేక గ్యాలరీలు, 8 వేలకుపైగా పురాతన కళాఖండాలు, శిల్పాలు, చారిత్రక వస్తువులు, ఆధునిక డిజిటల్‌ ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. శ్రీవారి ఆలయ చరిత్ర, భారతీయ శిల్పకళ, ఆలయ నిర్మాణ శైలి, సంగీతం, నృత్యం, పూజా సంప్రదాయాలు, పురాతన ఆయుధాలు తదితర అంశాలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుచేశారు. రాతి శిల్పాలు, కాంస్య విగ్రహాలు ఆనాటి కళాకారుల నైపుణ్యాన్ని, భారతీయ కళాసంప్రదాయాలను ప్రతిబింబించేలా కొలువుదీర్చారు.

ప్రత్యేక ఆకర్షణ బ్రహ్మాండం గ్యాలరీ

మ్యూజియంలో బ్రహ్మాండం గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హోలోగ్రాఫిక్‌ ప్రదర్శనలు, 360 డిగ్రీల సౌండ్‌, డిజిటల్‌ విజువల్స్‌ ద్వారా విశ్వం, సృష్టి రహస్యాలను సందర్శకులకు దృశ్యానుభూతి కలిగించేలా రూపొందించారు. అన్నమయ్య సంకీర్తనలు, నాణేల చరిత్ర, సంప్రదాయ సంగీత వాయిద్యాలకు సంబంధించిన ప్రదర్శనలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement