పుత్తూరు: మండలంలోని పరమేశ్వరమంగళం సమీపంలో గురువారం సాయంత్రం ఆటోను ట్రక్ లారీ ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఐదుగురు నిర్సింగ్ విద్యార్థినులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. పుత్తూరు బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ నర్సింగ్ కోర్సు చేస్తున్న 66 మంది విద్యార్థినులు ప్రతిరోజూ వేపగుంట క్రాస్ రోడ్డు వద్ద గల అన్నాగౌరీ వైద్యశాలలో ట్రైనింగ్ క్లాసులకు హాజరవుతున్నారు. గురువారం ఎనిమిది మంది ట్రైనింగ్ క్లాసు ముగించుకుని ఆటోలో పుత్తూరు బయలుదేరారు. పరమేశ్వరమంగళం గ్రామం వద్ద చైన్నె వైపు వెళుతున్న ట్రక్ లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో స్థానిక మరాఠిగేట్కు చెందిన ఆటో డ్రైవర్ డి.బాలకృష్ణ(35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఐదుగురు నర్సింగ్ విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో తేజశ్విని, జ్యోతి పరిస్థితి విషమంగా ఉండడంలో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. రేణుక, రిషిద, శరిత పుత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. డీఎస్పీ రవికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


