కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం అందులో భాగంగా సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామివారి విమాన వాహన సేవను కనులపండువగా జరిపించారు. ఈ సందర్భంగా వేకువజామునే మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేశారు. భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి అలంకార మండపంలో ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం పట్టుపీతాంబరాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అలంకరించారు. ఈ క్రమంలోనే ఊరేగింపుగా విమాన వాహనంపై కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళలు, కోలాటాలు, భజనబృందాల ప్రదర్శనలతో విమాన వాహన సేవ నిర్వహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నేడు సూర్యప్రభ వాహన సేవ
ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామికి ఆదివారం సూర్యప్రభ వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ యో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం విశేష అభిషేకం, రాత్రి సూర్యప్రభ వాహనసేవ ఉంటుందని వివరించారు.


