అర్ధగిరిలో చిత్తూరు ఎకై ్సజ్‌ కోర్టు జడ్జి | - | Sakshi
Sakshi News home page

అర్ధగిరిలో చిత్తూరు ఎకై ్సజ్‌ కోర్టు జడ్జి

Sep 28 2026 7:45 AM | Updated on Sep 28 2026 7:45 AM

తవణంపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామిని ఆదివారం చిత్తూరు ఎకై ్సజ్‌ కోర్టు న్యాయమూర్తి జి.కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ రఘుపతి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. న్యాయమూర్తి స్వామికి అభిషేకం, అర్చనలు, పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జడ్జిని స్వామి వారి ఆస్థాన మండపంలో ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ రఘుపతి, అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించారు. తీర్థప్రసాదాలు, సంజీవరాయ పుష్కరిని తీర్థం అందజేసి ఆశీర్వదించారు.

రేపటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్ల ఎంపిక

తిరుపతి ఎడ్యుకేషన్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్ల ఎంపిక పోటీలను మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఆ మేరకు డీఈఓ కేవీఎన్‌.కుమార్‌, ఎస్‌జీఎఫ్‌ తిరుపతి జిల్లా కార్యదర్శులు ఎస్‌.సాంబశివరావు, అమ్ములు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 29న తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో అండర్‌–17, 19 విభాగాల్లో చెస్‌ పోటీలు, వడమాలపేట జెడ్పీ హైస్కూల్లో అండర్‌–17, 19 విభాగాల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌, 30వ తేదీన అవిలాలలోని బాక్సింగ్‌ అకాడమీలో అండర్‌–14, 17, 19 విభాగాల్లో బాక్సింగ్‌, తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్లో అండర్‌–14, 17, 19 విభాగాల్లో తైక్వాండో, అకార్డ్‌ పాఠశాలలో అండర్‌–14, 17 విభాగాల్లో టెన్నిస్‌, అక్టోబరు 1వ తేదీన శ్రీకాళహస్తిలోని జెడ్పీ హైస్కూల్లో అండర్‌–14, 17, 19 విభాగాల్లో టేబుల్‌ టెన్నిస్‌, 3వ తేదీన తిరుపతి మంగళం ట్రెండ్స్‌ జెడ్పీ హైస్కూల్లో అండర్‌–14, 19 విభాగాల్లో జూడో, బుచ్చినాయుడుకండ్రిగ జెడ్పీ హైస్కూల్లో అండర్‌–17 విభాగంలో రగ్బీ జిల్లా జట్లు ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆయా తేదీల్లో నిర్వహించే ఎంపిక పోటీలకు స్టడీ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డుతో హాజరుకావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 63001 12569, 99893 20511 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.

నేడు చంద్రప్రభ వాహనం

కాణిపాకం: ప్రత్యేక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి సోమవారం చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారని ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. ఉదయం అభిషేకం, రాత్రికి చంద్రప్రభ వాహన సేవ ఉంటుందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement