నారాయణవనం: చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహింవిన పోటీలలో ప్రతిభ కనబరచిన సిద్ధార్థ కళాశాల విద్యార్థులు వెంకటమానస, దివాకర్‌రెడ్డి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ట్లు కళాశాల పీడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. వెంకటమా నస (బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్ తృతీయ సంవత్సరం) డిస్కస్‌త్రో, ట్రిపుల్ జంప్ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించింది. దివాకర్‌రెడ్డి (బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం) 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెం విభాగాలలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాలను సాధించాడు. కళాశాల చైర్మన్ అశోకరాజు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా రాణించాలన్నారు. ప్రిన్సిపాల్ జనార్దన్‌రాజు, పీడీ సుబ్రహ్మణ్యం విద్యార్థులను అభినందించారు.


