ఈఎస్‌ఆర్‌ వేధింపులు | - | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఆర్‌ వేధింపులు

Sep 28 2026 7:45 AM | Updated on Sep 28 2026 7:45 AM

ఈఎస్‌ఆర్‌ నమోదు పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులపై కూటమి సర్కార్‌ కత్తి సాంకేతికత పేరుతో టార్చర్‌ పాత వివరాలు ముంచేసి.. కొత్తగా నమోదు చేయాలని హుకుం నెట్‌ సెంటర్ల చుట్టూ తిప్పుతున్న వైనం ఈ నెలాఖరులోపు చేయాలంటూ సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా 72 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇందులో 31,622 మంది వరకు అన్ని కేడర్లలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధు లు నిర్వహిస్తున్నారు. అధిక శాతం ఉపాధ్యాయులు 14,250 మంది వరకు ఉన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను చిటికెలో పరిష్కరిస్తామని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సరికొత్తగా ఈఎస్‌ఆర్‌ నిబంధనల పేరుతో నిలువునా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. గతంలో ఇచ్చిన ఈఎస్‌ఆర్‌ డేటా ఏమైందో చెప్పకుండా మళ్లీ కొత్తగా వివరాలు నమోదు చేయాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని ఒక్కో ఉద్యోగి ఈఎస్‌ఆర్‌ డేటా నమోదుకు రెండు రోజుల సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కిందటి సర్వీస్‌ రికార్డులు దొరక్క ఉద్యోగ విరమణ అంచున ఉన్న సీనియర్లు అష్టకష్టాలు పడుతున్నారు. నెట్‌ సెంటర్లు చుట్టూ తిరుగుతూ రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పాత డేటాను అనుసంధానించే అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగులను వేధించడానికే సర్కారు ఈ పంతానికి పోతోందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నారు.

పదవీ విరమణ వేళ అష్టకష్టాలు

కొత్త ఈఎస్‌ఆర్‌లో పెట్టిన అత్యంత క్లిష్టమైన, సంక్లిష్టమైన నిబంధనల వల్ల ఒక్కో ఉద్యోగి సమాచారం అప్‌లోడ్‌ చేయడానికి కనీసం రెండు రోజులు పడు తోంది. దశాబ్దాల కిందటి సర్వీసు పుస్తకాలు, అర్హత పత్రాలు, ప్రమోషన్లు, జీతాల స్కేలు వివరాలు వెతికి పట్టుకోవడం గగనంగా మారింది. ముఖ్యంగా పదవీ విరమణ అంచున ఉన్న సీనియర్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ సాంకేతిక మెలికల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఒత్తిడికి లోనవుతున్నారు.

నెట్‌ సెంటర్ల దోపిడీ

ఒకవైపు సర్వర్ల మొరాయింపు, సాంకేతిక లోపాలు చుట్టుముట్ట గా, మరోవైపు ఈ పరిస్థితిని ఆస రాగా చేసుకుని నెట్‌ సెంటర్లు దోచుకుంటున్నారు. రూ.1,000 నుంచి రూ.2,000 వరకు డిమాండ్‌ చేస్తున్నాయి. బోధన ను పక్కనబెట్టి రోజంతా ఇంటర్‌నెట్‌ సెంటర్ల చుట్టూ తిర గాల్సి వస్తోందని ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఉద్యోగులను అష్టకష్టాల పాలు చేయడానికే సర్కారు ఇలాంటి తుగ్లక్‌ నిర్ణయాలు అమలు చేస్తోందని, తక్షణమే ఈ వేధింపులను ఆపి, గడువు పెంపుతో పాటు పాత డేటాను పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈఎస్‌ఆర్‌ నమోదుపై పంపిన మెసేజ్‌లు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఏదో ఒకసాకుతో వేధింపులకు గురిచేస్తూనే ఉంది. తాజాగా ఈ సర్వీస్‌ రిజిస్టర్‌ (ఈఎస్‌ఆర్‌) పేరుతో ఇబ్బందులు పెడుతోంది. గతంలోనే రూ.వేలు వెచ్చించి, రాత్రింబవళ్లు శ్రమించి పూర్తి చేసిన ఈఎస్‌ఆర్‌ డేటాను బుట్టదాఖలు చేసి మళ్లీ ఇప్పుడు మొదటి నుంచి కొత్తగా వివరాలు నమోదు చేయాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర ఒత్తిడికి లోను చేస్తోంది. ఈ నెలాఖరులోపు ప్రక్రియను ముగించాలంటూ సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపుతోంది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం

ఉపాధ్యాయులు 14,250

రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు

8498

పోలీసులు 1400

నాల్గవ తరగతి ఉద్యోగులు 3297

సచివాలయ ఉద్యోగులు 4177

మొత్తం ఉద్యోగులు 31,622

మెసేజ్‌లతో మానసిక వేధింపులు

ఈ నెలాఖరుకు నూతన ఈఎస్‌ఆర్‌ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు నయానా భయానా హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఫోన్లకు రోజూ హెచ్చరిక మెసేజ్‌లు పంపుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. గతంలో అప్‌లోడ్‌ చేసిన సర్వీసు వివరాలు, రికార్డులను గాల్లో కలిపేసి, ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ చేపట్టమనడం వెనుక ప్రభుత్వం పగబట్టినట్లు వ్యవహరిస్తోందని సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement