కుటుంబ కలహాలకు తండ్రి, కొడుకు బలి! | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలకు తండ్రి, కొడుకు బలి!

Sep 28 2026 7:45 AM | Updated on Sep 28 2026 7:45 AM

● కొడుక్కు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య ● తండ్రి, కుమారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు ● యాదమరి మండలం వెంకటాపురం దళితవాడలో ఘటన

యాదమరి: ఆ పచ్చని సంసారంలో కుటుంబ కలహాలు చిచ్చు రగిల్చాయి. క్షణికావేశంలో ఆ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నారు. కన్న ప్రేమను మరిచి పదేళ్ల కుమారునికి విషమిచ్చి ప్రాణాలు తీశాడు. తర్వాత తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ హృదయ విచారకర ఘటన యాదమరి మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని భూమిరెడ్డిపల్లి పంచాయతీ వెంకటాపురం దళితవాడకు చెందిన దొరస్వామి కుమారుడు బాబు(35) అమరరాజ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా అతను తన భార్యతో కలిసి చిత్తూరులో నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామమైన వెంకటాపురంలో బంధువుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బాబు తన కుమారుడితో వచ్చాడు. ఎప్పుడు స్వగ్రామానికి వచ్చినా పనులు ముగించుకుని వెంటనే వెళ్లే బాబు రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తాము తరచూ ఘర్షణ పడుతున్నామని బాబు తన స్నేహితుల వద్ద వాపోయేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాబు, ముందుగా తన కుమారుడు లోహిత్‌(10)కు విషం తాగించాడు. చిన్నారి ప్రాణాలు విడవడం చూసిన తర్వాత అతను కూడా అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్‌ విచారణ చేపట్టారు. మృతుని భార్య ఓ ప్రైవేటు పాఠశాలలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నారని, వారి మధ్య తలెత్తిన వివాదాలే ఈ దారుణానికి ప్రధాన కారణమని మృతుని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమాచారం బాబు భార్యకు తెలిసినా ఆమె రాకపోవడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement