సివిల్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): సివిల్‌ కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక స్పష్టం చేశారు. శనివారం న్యాయమూర్తులకు జిల్లా కోర్టు భవన సముదాయంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం కేసుల విచారణ చేపట్టాలన్నారు. సివిల్‌ కేసులు, డిక్రీలు, ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లు తదితర అంశాలను హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ జి.వి. సీతాపతి, జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి వివరించారు.మొదటి, అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసరావు, నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన, ఆరో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి టి.హరిత, రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సూర్యనారాయణమూర్తి, మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గురునాథ్‌, ఏడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీలత, తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement