చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 28, 29 తేదీల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్య టిస్తుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సూర్య నారాయణరాజు, సభ్యు లు పద్మలత జిల్లాలో పర్యటిస్తారన్నారు. 28న మధ్యా హ్నం కమిటీ సభ్యులు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కేజీబీవీలు, బాలల సంరక్షణ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తారని వివరించారు. మౌలి క వసతులు, బాలల రక్షణ చర్యలను పరిశీలిస్తారన్నారు. 29న ఉదయం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. కమిటీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదేం వైద్యం గురువా!
పలమనేరు: ప్రభుత్వ పాఠశాలల్లో గురువులు పాఠాలు చెప్పాలి కానీ, కొందరు అతిగా వ్యవహరించి అభాసుపాలవుతున్నారు. ఇలాంటి ఘటనే పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లె మండలం కంచనపల్లెలో రెండు రోజుల క్రితం జరిగింది. పాఠశాలలోని ఓ టీచర్ ఆయుర్వేదంపై మక్కువతో కొన్నేళ్లుగా భోజ నం చేయకుండా కేవలం కొన్ని ద్రావణాలు తాగుతానని చెబుతున్నారు. అలాగే ఆయన ప్రభుత్వ బడిలో ఓ ఆలయం నిర్మించాడు. అక్కడే నిత్యం పూజల్లో ఉంటారు. అక్కడితో ఆగకుండా తాను పాటిస్తున్నవిధానాలను పిల్లలపై రుద్దాడు. కొన్నాళ్లుగా విద్యార్థులకు కొన్ని ఆకులు, సుంగధ ద్రవ్యాలు తినిపిస్తున్నారు. గురువారం ఈ క్రమంలోనే పిల్లలు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఆశా వర్కర్ ఇచ్చిన ఐరన్ మాత్రలు వేసుకుని అస్వస్థతకు గురయ్యారు. సదరు టీచర్ తినిపించిన నాటు మందుల కారణంగానే పిల్లలు అనారోగ్యానికి గురయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఈఓల పర్యవేక్షల లేకపోవడంతోనే టీచర్లు ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.30 వేల అపహరణ
పలమనేరు : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో శుక్రవారం కుప్పం బస్సు ఎక్కిన ఓ ప్రయాణికుడి జేబులోని రూ.30 వేలు అపహరణకు గురైంది. వివరాలు.. బైరెడ్డిపల్లెకు చెందిన టమాటా వ్యాపారి అశోక్ పలమనేరుకు సొంత పనికోసం వచ్చాడు. స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండుకు వచ్చి బస్సు ఎక్కుతుండగా నగదు చోరీకి గురైంది. బాధితుడు ఈ మేరకు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.


