సిఫారసుల్లేని పాలన | - | Sakshi
Sakshi News home page

సిఫారసుల్లేని పాలన

Sep 25 2026 1:47 AM | Updated on Sep 25 2026 1:47 AM

● వీడ్కోలు కార్యక్రమంలోజెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు

మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌

గోవిందప్ప శ్రీనివాసులు

చిత్తూరు కలెక్టరేట్‌ : తమ పాలనలో జెడ్పీ ఉద్యోగుల ఉద్యోగోన్నతులు, జిల్లాల విభజనలో ఎలాంటి సిఫార్సులకు తావులేకుండా నిర్ణయాలు తీసుకున్నామని జెడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. హాజరైన ఆయన మాట్లాడుతూ తమ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సిఫార్సులకు అవకాశం ఇవ్వకుండా సీనియారిటీ ప్రకారమే ఉద్యోగోన్నతులు, కారుణ్య నియమకాలు చేపట్టామని తెలిపారు. జిల్లాల పునర్విభజనలో ఉద్యోగుల విభజన అనివార్యమైందన్నారు. ఇందులోనూ ఎలాంటి సిఫార్సులకు తావివ్వకుండా సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలను కేటాయించా మని తెలిపారు. తనవల్ల ఏ ఉద్యోగి అయినా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరుతూ భావోద్వేగానికి గురయ్యారు. గురువారంతో ప్రస్తుత జెడ్పీ పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన చివరి ప్రసంగం భావోద్వేగభరితంగా సాగింది. అనంతరం జెడ్పీ సీఈఓ రవికుమార్‌ నాయుడు ఉద్యోగుల సమక్షంలో సీనియారిటీ జాబితా ఆధారంగా వారికి జిల్లాల కేటాయింపు ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement