23 మంది విద్యార్థులకు అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

23 మంది విద్యార్థులకు అస్వస్థత

Sep 25 2026 1:47 AM | Updated on Sep 25 2026 1:47 AM

బైరెడ్డిపల్లె: మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గురువారం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. చిక్కనపల్లె ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి రోజు ఆయుర్వేద వైద్యం పేరుతో కొన్ని ఆకులు, సుగంధ ద్రవ్యాలు ఇచ్చేవారు. గురువారం కూడా విద్యార్థులు ఆకులు, ద్రవ్యాలు ఇచ్చారు. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఆశా వర్కర్‌ పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ఐరన్‌ మాత్రలు ఇచ్చారు. ఆ తర్వాత 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. అస్వస్థతకు కారణం ఏమైందో తెలియదు గానీ గ్రామస్తులు విషయం తెలుసుకుని 108 వాహనానికి సమాచారం అందించి బైరెడ్డిపల్లె పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈవో దేశమ్మ బైరెడ్డిపల్లె పీహెచ్‌సీ చేరుకుని విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement