పచ్చ తమ్ముడు బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

పచ్చ తమ్ముడు బరితెగింపు

Sep 24 2026 1:42 AM | Updated on Sep 24 2026 1:42 AM

● 20 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న దారి మూసివేత ● పట్టా భూమి అంటూ రోడ్డుపై రాతి కంచె వేసి దౌర్జన్యం

● 20 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న దారి మూసివేత ● పట్టా భూమి అంటూ రోడ్డుపై రాతి కంచె వేసి దౌర్జన్యం

పూతలపట్టు(యాదమరి): బెంగళూరులో వ్యాపారాలు సాగిస్తున్న మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి అండదండలతో ఆ పార్టీ సానుభూతిపరుడు రెచ్చిపోయాడు. 20 ఏళ్లుగా గ్రామంలో రాకపోకల కొనసాగిస్తున్న దారికి ఫెన్సింగ్‌ వేశాడు. దీంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బాధితుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం బి.రామాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు 15 కుటుంబాల వారు ఉన్నారు. వీరు 20 ఏళ్లుగా గ్రామ కంఠం భూమిలో ఉన్న దారిలో రాకపోకలు సాగిస్తున్నారు. రాజవీధిలో కొంత భూభాగం తమదే అని అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు గ్రామస్తులతో ఘర్షణకు దిగాడు. అంతటితో ఆగక రాతి స్తంభాలతో ఫెన్సింగ్‌ వేసాడు. దీనిపై ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగాడు. తాము 20 ఏళ్లుగా ఈ దారి నుంచి రాకపోకలు సాగిస్తున్నామని, ఇప్పుడు పట్టా భూమి అనడం ఎంతవరకు సమంజమని గ్రామస్తులు వాపోతున్నారు. రాజకీయ అండ చూసుకుని ఆక్రమణకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారిని మూసివేయడంతో తాగునీటి ట్యాంకర్లు లోపలికి రాలేకపోతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలకుల నిర్వాకం వల్ల తాగునీరు దొరకక నరకయాతన అనుభవిస్తున్నామని మహిళలు ఆవేదన చెందుతున్నారు. అత్యవసర సమయాల్లో వృద్ధులు, రోగులు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌, చిత్తూరు ఆర్డీఓకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. దీనిపై తహసీల్దార్‌ ఉదయ్‌ సంతోష్‌ను వివరణ కోరగా సమస్య తమ దృష్టికి రావడంతో క్షేత్ర స్థాయిలో విచారణ చేశామన్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించగా విఫలమైనట్టు పేర్కొన్నారు. మరోసారి చర్చించి దారి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement