గుడిపాల మండలం, ఏ.ఎల్.పురం గ్రామానికి చెందిన యానాది కులానికి చెందిన మణికంఠ తనకు ఎలాంటి సొంత భూములు లేవని కలెక్టర్‌కు విన్నవించారు. గ్రామ లెక్కల రికార్డుల ప్రకారం సర్వే నెంబర్లు 447–1, 447–2లోని భూమిని పరిశీలించి తనకు పట్టా మంజూరు చేయాలని కోరారు. ఇందుకోసం మండల అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సుమిత్ కుమార్ వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.


