కుప్పంరూరల్ : మండలంలో ని నడుమూరులో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నారాయణ అనే వ్యక్తి ఇంట్లో మంటలు చెలరేగాయి. బాధితులు నిద్ర లేచి చూసే సరికే గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలు వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. ప్రభుత్వం చేయూతనందించాలని బాధితుడు కోరాడు.
ప్రాణం తీసిన చేపల వేట
గంగాధరనెల్లూరు : మండలంలోని గొల్లపల్లె చెరువులో చేపల వేట ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వివరాలు.. ఈడిగపల్లెకు చెందిన ఎస్.గోపాలయ్య, సమీప గ్రామానికి చెందిన జగన్నాథంతో కలసి గొల్లపల్లె చెరువులో చేపల వేటకు వెళ్లాడు. అయితే చెరువులో సుమారు 10 అడుగుల లోతు వరకు నీరు ఉండడంతో వల వేసేందుకు జగన్నాథం యత్నిస్తూ బురదలో చిక్కుకున్నాడు. గోపాలయ్య వెంటనే గ్రామస్తులకు విషయం తెలియజేశాడు. అందరూ హుటాహుటిన చెరువు వద్దకు చేరుకునే సరికి జగన్నాథం మృత్యువాత పడ్డాడు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు.


