అర్జీదారుల అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

అర్జీదారుల అసంతృప్తి

Sep 8 2026 1:35 AM | Updated on Sep 8 2026 1:35 AM

సమస్యలకు పరిష్కరించడం లేదని ఆవేదన ఏళ్ల తరబడి తిరుగుతున్నా ప్రయోజనం లేదని ఆక్రోశం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడమే కారణం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో వినతులు స్వీకరించిన కలెక్టర్‌ వివిధ సమస్యలపై నమోదైన 264 అర్జీలు

కలెక్టర్‌కు సమస్యలు విన్నవించుకుంటున్న అర్జీదారులు

నిరసన తెలుపుతున్న పిల్లగుండ్లపల్లె వాసులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని క్షేత్రస్థాయి అధికారుల తీరుపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండల, గ్రామ స్థాయిల్లో అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా సమస్యలు తీరకపోవడంతో బాధితులు చివరి ఆశగా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు తరలివస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ సుమిత్‌ కుమా ర్‌ గాంధీ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు కలెక్టర్‌ ఎదుట తమ సమస్యలను విన్నవించుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం, స్థానిక నాయకుల వేధింపులు, ఆక్రమణలతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.

ఆక్రమణపై నిరసన

ఎస్‌.ఆర్‌.పురం మండలం, పిల్లిగుండ్లపల్లెకు చెందిన పేద ప్రజలు కలెక్టరేట్‌లో నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ కటికపల్లె పంచాయతీలోని 33 మంది పేద, వెనుకబడిన తరగతుల కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను కొంతమంది రాజకీయ నాయకులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థలంలో పంటలు సాగు చేస్తున్నారని చెప్పారు. పేదల స్థలాలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్‌, రెవెన్యూ అధికారులను క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి ఆక్రమణలను తొలగించి నిబంధనల మేరకు బాధితులకు న్యాయం చేయా లని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement