నాసిరకంగా పనులు | - | Sakshi
Sakshi News home page

నాసిరకంగా పనులు

Sep 8 2026 1:41 AM | Updated on Sep 8 2026 1:41 AM

● పీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కార్‌పార్కింగ్‌ మూడు కార్లు పెట్టడానికే రూ.5 లక్షలు విలువైన పనులను నామినేట్‌ రూపంలో ఆయనకు ఇచ్చారనే విమర్శ ఉంది. ● చిత్తూరులోని ఇరువారంలో ఇటీవల ప్రారంభించిన కేంద్రీయ విద్యాలయానికి అప్పగించిన భవనానికి సదరు పచ్చనేతే మరమ్మ తులు చేయించగా, ప్రారంభం రోజే గోడలు బీటలువారింది. ● జెడ్పీ పాత సమావేశ మందిరం మరమ్మతు చేసిన కొద్ది రోజులకే పెచ్చులూడిన గోడ, పగిలిన కిటికీల అద్దాలు, అధ్వానంగా టాయి లెట్‌ దుస్థితి. జెడ్పీలో టాయిలెట్స్‌ నిర్వహణకే ఏడాదికు రూ.5 లక్షలకు ఆయన టెండర్‌ దక్కించుకున్నారు. ● గంపగుత్తగా రూ.15కోట్ల పనులు ● నామినేషన్‌ విధానంలోనే అధికం ● కమీషన్‌ చెల్లిస్తేనే ఇతర కాంట్రాక్టర్లకు వర్క్‌లు ● ప్రజాప్రతినిధులకు సైతం వాటాలు ● సహకరించని అధికారులకు బెదిరింపులు ● జెడ్పీ కార్యాలయంలో అదనపు గది నిర్మాణానికి రూ.30 లక్షలు ● జెడ్పీ అతిథిగృహం కూల్చివేతకు రూ.5 లక్షలు ● జెడ్పీ క్వార్టర్స్‌ కూల్చివేతకు రూ.3 లక్షలు ● జెడ్పీ నార్త్‌ వింగ్‌ ఆధునికీకరణకు రూ.20 లక్షలు ● జెడ్పీ గెస్ట్‌హౌస్‌ సూట్‌రూమ్‌ కూల్చివేతకు రూ.2.15 లక్షలు ● పీఆర్‌ఐ సబ్‌డివిజన్‌ గది ఆధునికీకరణకు రూ.4.50 లక్షలు ● పీఆర్‌ సబ్‌డివిజన్‌ పెయింటింగ్‌కు రూ.5 లక్షలు ● జెడ్పీ కొత్త సమావేశ మందిరం లిఫ్ట్‌కు రూ.16 లక్షలు ● పీఆర్‌ఐఈఈ కార్యాలయంలో రెండో అంతస్తు నిర్మాణానికి రూ.50 లక్షలు ● పాత డీపీఓ కార్యాలయంలో భవనం నిర్మాణానికి రూ.40 లక్షలు ● జెడ్పీలో నార్త్‌ వింగ్‌ బ్లాక్‌లో మొదటి అంతస్తు భవన నిర్మాణానికి రూ.25 లక్షలు ● డీఎల్‌డీఓ కార్యాలయ సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.15 లక్షలు ● డీఎల్‌డీఓ కార్యాలయ పనులు పూర్తి చేయడానికి రూ.8.80 లక్షలు ● జిల్లాలో 5 కిలోమీటర్ల సోలార్‌ ఫెన్సింగ్‌కు రూ.47.05 లక్షలు ● గుడిపాలలో జెడ్పీహెచ్‌ఎస్‌ దుకాణ సముదాయానికి రూ.35 లక్షలు ● జీడీనెల్లూరులో డీపీఆర్సీ భవన ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.35 లక్షలు ● కుప్పంలో డీఎల్‌డీఓ కార్యాలయ పనులకు రూ.8 లక్షలు ● పలమనేరు, మదనపల్లె, తొట్టంబేడులో డీఎల్‌డీఓ కార్యాలయాల పనులకు రూ.43.10 లక్షలు ● చిత్తూరులో జెడ్పీ దుకాణ సముదాయానికి రూ.50 లక్షలు ● పీఆర్‌ఐ డివిజన్‌ రెండో అంతస్తు నిర్మాణానికి రూ.50 లక్షలు ● జెడ్పీ కార్యాలయంలో సీసీ రోడ్డు, కాలువ నిర్మాణానికి రూ.12.50 లక్షలు ● డిప్యూటీ సీఈఓ కార్యాలయ ఆధునికీకరణ షటిల్‌ కోర్టుకు రూ.22 లక్షలు ● దిగువమాసపల్లెలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.15 లక్షలు ● జీడీనెల్లూరులో డీపీఆర్సీ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు ● బీఎన్‌ఆర్‌పేట జెడ్పీహెచ్‌ఎస్‌లో వంటగది నిర్మాణానికి రూ.10 లక్షలు

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

చిరుతల సంచారంపై కలకలం
చిత్తూరు మండలంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. దీనిపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. టోకెన్‌ లేని భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 18 గంటలు పడుతోంది.
ప్రస్తుతం టీడీపీ నేత చేస్తున్న పనులు ఇవీ..

మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

జెడ్పీ పాత సమావేశ మందిరంలో పెచ్చూలూడిన గోడ

అడగకాండ్ర!

అవినీతిని

మా రాజ్యం.. పనులన్నీ మాకే.. నిధులన్నీ మాకే భోజ్యం.. ఏం చేసినా మా పేరు మీదే చేయాలి.. మమ్మల్ని ప్రశ్నిస్తే సహించం.. అడ్డుకోవాలని యత్నిస్తే అంతుచూస్తాం.. అంటూ ఓ టీడీపీ నేత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. మొత్తం జిల్లా పరిషత్‌ కార్యాలయాన్నే తన కబంధ హస్తాల్లో ఇరికించుకుని చక్రం తిప్పుతున్నాడు. అధికారులను భయపెట్టి మరీ రూ.కోట్ల పనులను కై వసం చేసుకుంటున్నాడు. అధిక సంఖ్యలో టెండర్‌ ప్రక్రియ లేకుండానే నామినేషన్‌ విధానంలో చేజిక్కించుకుంటున్నాడు. నాసిరకంగా నిర్మాణాలు పూర్తి చేసి సొమ్ము వెనకేసుకుంటున్నాడు. ఇతర కాంట్రాక్టర్లు పోటీ పడితే బెదిరింపులకు తెగబడుతున్నాడు. వర్క్‌ కావాలంటే కమీషన్‌ చెల్లించాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నాడు. అక్రమార్జనలో ప్రజాప్రతినిధులకు సైతం వాటాలు పంచుతూ జెడ్పీని శాసిస్తున్నాడు.

టీడీపీ నేత గుప్పిట్లో జిల్లా పరిషత్‌

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కాంట్రాక్టర్‌ ముసుగులోని ఓ టీడీపీ నేత హల్‌చల్‌ చేస్తున్నాడు. నిబంధనలు, చట్టాలను తుంగలో తొక్కి తన మాటను చెల్లుబాటు చేసుకుంటున్నాడు. సహకరించని అధికారులను బెదిరించి మరీ దారికి తెచ్చుకుంటున్నాడు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.15 కోట్లకు పైగా విలువైన దాదాపు 150 పనులను తన ఖాతాలో వేసుకున్నాడు. జెడ్పీ సాధారణ నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులను టార్గెట్‌ చేస్తున్నాడు. ఈ అవినీతి దందాలో తెరవెనుక పలువురు ప్రజాప్రతినిధులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రూ.5లక్షలలోపు పనులను నామినేషన్‌ పద్ధతిలో కేటాయించే వెసులుబాటును ఆసరాగా చేసుకుని, రూ.20 లక్షల పనులను సైతం నాలుగు ముక్కలుగా విభజించి అక్రమంగా దోచేసుకుంటున్నాడు. టెండర్లు పిలిచినా వేరే కాంట్రాక్టర్‌ పోటీకి రాకుండా భయపెడుతున్నాడు. తాను వద్దనుకునే పనులను ఇతర కాంట్రాక్టర్‌లకు కమీషన్‌కు అమ్ముకుంటున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆ నలుగురి సహకారం

మొత్తం దందాకు జెడ్పీలోని ఇద్దరు అధికారులు, యూనియన్‌ పేరు చెప్పుకుని తిరిగే ఇద్దరు ఉద్యోగులు సహకారం అందిస్తున్నట్లు పలువురు సిబ్బంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వీరిని వెంటబెట్టుకుని సదరు టీడీపీ నేత మొత్తం యంత్రాంగాన్నే శాసిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైన పనులకు పోటీగా టెండర్‌ వేయడానికి వస్తే వారితో మధ్యస్తం చేయడమే వీరు పనిగా పెట్టుకున్నారు. జెడ్పీ సమీపంలోని ఓ మద్యం దుకాణంలో లాబీయింగ్‌లు చేస్తుంటారని తోటి ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. అనధికార బాస్‌గా వ్యవహరించే టీడీపీ నేతతో కలిసి పలు పనులను భాగ్యస్వామంగా చేస్తున్నట్లు సమాచారం. పచ్చనేత చెప్పిందే వేదవాక్కుగా వ్యవహరిస్తుంటారని తెలిసింది. ఇతర కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వద్దు, వారి బిల్లులను లేట్‌ చేయి అంటే సరే అని తలలు ఊపడం వీరికి అలవాటు. చివరకు క్వాలిటీ కంట్రోల్‌ అధికారులకు సైతం ఖరీదైన బహుమతులు ఇచ్చి, తాను చేసిన నాసిరకం పనులను బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై టీడీపీకి చెందిన ఇతర నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పక్కనపెట్టి ఓకే నాయకుడికి అన్ని పనులు కట్టపెట్టడం ఏంటని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి వారి కారణంగా పార్టీకి నష్టం కలుగుతుందని విమర్శిస్తున్నారు. అయితే బడా నేతలకు కమీషన్లు ఇవ్వడంతోనే సదరు నేత హవా నడుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

జాగ్రత్త పడతాం

సాధారణంగా ఒకరికే పనులన్నీ ఇవ్వం. జెడ్పీ పరిధిలో ఒకరికే ఎక్కువ పనులు ఇచ్చినట్లు మా దృష్టికి రాలేదు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాం. ఈ మేరకు పంచాయతీరాజ్‌ అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశాం. సదరు కాంట్రాక్టర్‌కు ఉద్యోగుల సహకరిస్తున్న అంశంపై దృష్టి పెడతాం. వాస్తవమైతే తగిన చర్యలు తీసుకుంటాం.

– రవికుమార్‌నాయుడు, జెడ్పీ సీఈఓ

అక్రమ కేసులు అన్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement