ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల పెంపునకు కృషి | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల పెంపునకు కృషి

Aug 26 2026 12:24 AM | Updated on Aug 26 2026 12:24 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో అడ్మిషన్ల పెంపునకు కృషి చేయాలని స్కూల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ జయప్రకాష్‌నాయుడు కోరారు. మంగళవారం నిర్వహించిన స్లాష్‌ సమావేశంలో అడ్మిషన్‌ల పోస్టర్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అనివార్య కారణాలతో మధ్యలో చదువు మానేసిన అభ్యర్థులు ఓపెన్‌ స్కూల్‌ విధానంలో పది, ఇంటర్‌ పూర్తి చేయవచ్చన్నా రు. అపరాధ రుసుం లేకుండా ప్రవేశం పొందేందుకు సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు అవకా శం ఉందని వెల్లడించారు. ఆసక్తిగలవారు జిల్లా లోని ఓపెన్‌ స్కూల్‌ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూ చించారు. కార్యక్రమంలో ఎంఈఓలు ప్రసాద్‌, గణపతి పాల్గొన్నారు.

ఇన్‌ సర్వీస్‌ టీచర్లపై

నిర్లక్ష్యం తగదు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఇన్‌ సర్వీస్‌ టీచర్లపై ప్రభు త్వం నిర్లక్ష్యం వహించడం తగదని ఎస్టీ యూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్‌మోహన్‌రెడ్డి, ఇలియా జ్‌ ఆవేదన వ్యక్తం చేశా రు. మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడారు. సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తు న్న ఇన్‌సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించి ఉత్తీర్ణత మార్కులను 40 శాతానికి పరిమితం చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాల విద్యాశాఖ ఇటీవల విడుద ల చేసిన టెట్‌ నోటిఫికేషన్‌న్‌లో సీనియర్‌ ఉపాధ్యాయులకు ఎలాంటి వెసులుబాటు కల్పించకపోవడం విచారకరమన్నారు. డిపార్ట్‌మెంట్‌ పరీక్షల మాదిరిగానే ప్రత్యేక టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాల ని సూచించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాల ల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ, వివిధ శిక్షణ లు పొందిన అనుభవజ్ఞులైన టీచర్లను కొత్త అభ్య ర్థులతో సమానంగా చూడడం సమంజసం కాద ని స్పష్టం చేశారు. దీనిపై పలుమార్లు విద్యాశాఖ మంత్రికి, ప్రభుత్వానికి విన్నవించినా స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.

ఓటరు ముసాయిదా జాబితా విడుదల

చిత్తూరు కార్పొరేషన్‌ : జిల్లాలోని 27 మండలాలు 622 పంచాయతీల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాను మంగళవారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 10,26,821 ఓటర్లు ఉండగా అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు 7,52,331 మంది ఉన్నారు. ఈ జాబితాలను పంచాయతీ, ఎంపీడీఓ, తహసీల్దార్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో నోటీసు బోర్డుపై ప్రచురించారు. ఈ మేరకు బుధవారం నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఓటర్ల నుంచి ఫిర్యాదు స్వీకరించనున్నారు. వీటిపై 29వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 2 వరకు క్షేత్రస్థాయిలో విచారించనున్నారు. సెప్టెంబర్‌ 3 నుంచి 6 వరకు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి అర్హులైన ఓటరు జాబి తా వివరాలను తెలియజేయనున్నారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఈనెల 7న తుది జాబితాను ప్రచురించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement