చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు, సిద్ధంపల్లె రైల్వేస్టేషన్ మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ పనులు చేపట్టడంతో వాహనాల రాకపోకలను మళ్లించిన ట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మంగళవా రం తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు వాహ నదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించేలా సంబంధిత అధికారులు చర్య లు చేపట్టాలని ఆదేశించారు. ఐదు రోజుల పా టు వాహనదారులు సైతం రైల్వే అధికారులు, పోలీసులకు సహకరించాలని సూచించారు.
అర్హత మార్కుల
కేటాయింపు తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రత్యేక టెట్‌లో 40 శాతం అర్హత మార్కు లను తప్పనిసరిగా కేటాయించాలని స్కూల్ అసిస్టెంట్ అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరోత్తమరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుతో అక్టోబర్ 11 నుంచి 21వ తేదీ వరకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ పరీక్షలో ఇన్‌సర్వీస్ టీచర్లందరికీ కేటగిరీలతో సంబంధం లేకుండా 40 శాతం (60 మార్కులు) ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించాలని సూచించారు. ప్రస్తుతం ప్రకటించిన నిబంధనల ప్రకా రం ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీ, ది వ్యాంగులకు 60 మార్కులు అర్హత ప్రమాణాలు గా ఉన్నాయని వివరించారు. ఏళ్ల తరబడి విధు ల్లో ఉన్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఇన్ని మా ర్కులు సాధించడం కష్టతరంగా మారిందన్నారు. అన్ని కేటగిరీల వారికి 150 మార్కులకు గాను 40 శాతం (60 మార్కులు) మాత్రమే క్వాలిఫైయింగ్‌గా సవరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు బోధించే నిర్దిష్ట సబ్జెక్టుల నుంచే టెట్‌లో ప్రశ్నలు ఇచ్చేలా సిలబస్ రూపొందించాలని కో రారు. పరీక్షను ఆన్‌లైన్ విధానంలోనే కాకుండా, ఆన్‌ఫ్‌లైన్‌లోనూ రాసే వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేశారు. ఇన్ సర్వీస్ టీచర్ల ప్రయోజనాలను పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే స్పందించి సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.


