తిరుపతి తుడా: స్విమ్స్ యూనివర్సిటీ శ్రీ పద్మా వతి మహిళా వైద్య కళాశాలలో ఆల్ ఇండియా కోటా ర్యాంకుల ప్రాతిపధికన కేటాయించిన సీట్లకు మంగళవారం నుంచి ప్రవేశా లు ప్రారంభమయ్యాయి. ఎంబీబీఎస్ కోర్సుకుగాను పద్మావతి మహిళా వైద్యకళాశాలలో చిత్తూరుకి చెందిన విద్యా ర్థిని ఎంఎల్ భావన తొలి అడ్మిషన్ పొందారు. ఈ మేరకు అడ్మిషన్ పత్రాన్ని విద్యార్థినికి స్విమ్స్ వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్ అందజేశారు. ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్స్ విజయలక్ష్మి, శర్వాణి పాల్గొన్నారు.


