లోపాలకు తావులేకుండా నిత్య కై ంకర్యాలు
● సమీక్షలో దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిన దేవస్థానంలో స్వామి వారికి నిర్వహించే నిత్య కై ంకర్యాలు ఎలాంటి లోపాలకు తావివ్వకుండా భక్తిప్రపత్తులతో నిర్వహించాలని రాష్ట్ర దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌లాల్ ఆదేశించారు. మంగళవారం కాణిపాకానికి వచ్చిన ఆయన అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఆన్‌లైన్ సేవలు, ఈ–ఆఫీస్, ఈ–ఫైలింగ్, అర్చకుల ప్రమోషన్లు, ఆలయంలో స్వామి వారికి చేసే పూజార్చనలు, సేవలు..ఇత్యాది వాటిపై సమీక్షిస్తూ ప్రధాన అర్చకులకు ఆయన పైవిధంగా సూచించారు. క్యూలలో వెళ్లే భక్తులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, గణేశా అని సంబోధించాలని సూచించారు. తర్వాత ఆన్‌లైన్ టికెట్ కౌంటర్ల వద్ద భక్తులతో మాట్లాడి సౌకర్యాలను తెలుసుకున్నారు. తొలుత వరసిద్ధి వినాయకస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ఈఓ పెంచలకిషోర్, చైర్మన్ మణినాయుడు ఆయన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ సాగర్‌బాబు, ఈఈ వెంకట నారాయణ, ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు శివప్రసాద్, ఏఈఓ లు రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, ధనంజయ, సూపరింటెండెంట్, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
వి.కోట: విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. మండలంలోని యాలకల్లు పంచాయతీ వైసీ బండపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్యగౌడు కుమారుడు రామయ్యగౌడు (67) వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లాడు. తమ పొలానికి సరఫరా అయ్యే విద్యుత్ వైర్లు రెండూ తెగి చెట్లుపై పడి ఉండడాన్ని గమనించాడు. ఆపై విద్యుత్ సరఫరా లేని సమయంలో వైర్లను సరిచేయడానికి ప్రయత్నించాడు. అతను సరి చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా రావడంతో రామయ్య షాక్‌కు గురై చెట్టు నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడ్ని వి.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండుప్రాణాన్ని బలిగొందని రైతులు మండిపడ్డారు.
హేత్వికకు ఎలైట్ వరల్డ్
రికార్డులో చోటు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు నగరానికి చెందిన ఒకటవ తరగతి విద్యార్థిని హేత్విక ఎలైట్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. వైఎస్‌ఆర్‌టీచర్స్ అసోసియేషన్ రెడ్డిశేఖర్‌రెడ్డి మనువరాలు హేత్విక ఇటీవల తమిళనాడు రాష్ట్రం వేలూరులో నిర్వహించిన ఎలైట్ వరల్డ్ రికార్డ్ పోటీల్లో స్పెల్ మారథాన్ అంశంలో పాల్గొంది. ఆ విద్యార్థిని ఈ పోటీల్లో 4 నిమిషాల్లో 50 పదాలను అక్షరదోషాలు లేకుండా మౌఖికంగా చెప్పినందుకు ఈ వరల్డ్ రికార్డు లభించింది. ఇదే విద్యార్థిని నృత్య పదర్శనలోనూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మరో రికార్డును సాధించడం విశేషం. రెండు వరల్డ్ రికార్డులు సాధించిన చిన్నారి హేత్వికను పలువురు అభినందిస్తున్నారు.
లోపాలకు తావులేకుండా నిత్య కై ంకర్యాలు


