రాష్ట్ర స్థాయి విజేతలకు అభినందనలు
చిత్తూరు కలెక్టరేట్ : ఇటీవల విశాఖపట్టణం జిల్లాలోని కేడీపేటలో నిర్వహించిన సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి సాప్ట్‌బాల్ పోటీల్లో గెలుపొందిన పీసీఆర్ పాఠశాల విద్యార్థులను డీఈవో రాజేంద్రప్రసాద్ అభినందించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. సబ్ జూనియర్ సాప్ట్‌బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో చిత్తూరు పీసీఆర్ పాఠశాలలో చదువుతున్న అక్షిత రజిత పతకం సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికై వచ్చే నెల 9 నుంచి హర్యానాలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుందన్నారు. హెచ్‌ఎం పూర్వాణి, శాంతిపురం ఎంఈఓ సెల్వపాండ్యన్, పీడీ దేవా పాల్గొన్నారు.
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 60,764 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,077 మంది భక్తులు తల నీలాలు అర్పించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది.


