వేదాంతా ఐరన్, స్టీల్‌ బిజినెస్‌ షురూ | Vedanta Owned Subsidiary Company Iron And Steel Ltd | Sakshi
Sakshi News home page

వేదాంతా ఐరన్, స్టీల్‌ బిజినెస్‌ షురూ

Oct 14 2023 7:59 AM | Updated on Oct 14 2023 8:01 AM

Vedanta Owned Subsidiary Company Iron And Steel Ltd - Sakshi

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ బిజినెస్‌ల విడదీత ప్రణాళికల్లో భాగంగా వేదాంతా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ పేరుతో పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 1 ముఖ విలువగల లక్ష ఈక్విటీ షేర్ల అధీకృత మూలధనంతో సంస్థకు తెరతీసింది.

గత నెల 29న ప్రకటించిన బిజినెస్‌ల విడదీత ప్రణాళికలకు అనుగుణంగా ఐరన్, స్టీల్‌ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసినట్లు వేదాంతా వెల్లడించింది. విభిన్న విభాగాలైన అల్యూమినియం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, స్టీల్‌ తదితరాలను 5 కంపెనీలుగా విడదీసేందుకు గత నెలలో వేదాంతా నిర్ణయించిన విషయం విదితమే.

తద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇనుము, స్టీల్‌ బిజినెస్‌ నిర్వహణకు తాజాగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే బుధవారం వేదాంతా బేస్‌ మెటల్స్‌ లిమిటెడ్‌ పేరుతో మరో సంస్థకు తెరతీసిన సంగతి తెలిసిందే.    

Advertisement
 
Advertisement
Advertisement