8,000 కంపెనీల షేర్ల కొనుగోలుకి వీలు
2,000 ఈటీఎఫ్‌లలోనూ పెట్టుబడికి ఓకే
న్యూఢిల్లీ: దేశీ ఇన్వెస్టర్లు యూఎస్ స్టాక్స్ కొనుగోలు చేసేందుకు వీలుగా అప్‌స్టాక్స్ సొంత ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. దీంతో యూఎస్‌లో లిస్టయిన 8,000కుపైగా కంపెనీల షేర్ల కొనుగోలుకి వీలు చిక్కనుంది. అంతేకాకుండా మరో 2,000 ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చని ఒక ప్రకటనలో స్టాక్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అప్‌స్టాక్స్ తెలియజేసింది.
యాప్ ద్వారా గ్లోబల్ దిగ్గజాలు యాపిల్, టెస్లా, అమెజాన్, గూగుల్ తదితర షేర్లను సొంతం చేసుకోవచ్చని తెలియజేసింది. దీనిలో భాగంగా ఇన్వెస్టర్లు కనీసం 1 డాలరుతో పెట్టుబడులు ప్రారంభించవచ్చని వెల్లడించింది. తద్వారా పూర్తి షేరుని కాకుండా దీనిలో కొంత భాగాన్ని సైతం కొనుగోలు చేయవచ్చని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులు దేశీ వెల్త్ ఎకోసిస్టమ్ తదుపరి దశ వృద్ధిని ప్రతిబింబిస్తాయని అప్‌స్టాక్స్ సహవ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా గ్లోబల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చని తెలియజేశారు.
పెట్టుబడులు ఇలా
వినియోగదారులు తమ దేశీ బ్యాంక్ ఖాతాల ద్వారా రూపాయలలోనే పెట్టుబడులు చేపట్టవచ్చని అప్‌స్టాక్స్ పేర్కొంది. ఇవి ఆటోమేటిగ్గా డాలర్లలోకి మారి్పడి అవుతాయని తెలియజేసింది. ఇన్వెస్టర్లు యూఎస్ మార్కెట్ల ట్రేడింగ్ సమయంకానప్పుడు కూడా ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ల ద్వారా కొనుగోలు ఆర్డర్లు నమోదు చేయవచ్చని వివరించింది. స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్, ఏఐతోపాటు.. ఇతర వర్ధమాన టెక్నాలజీలు, ఇతర రంగాలలో పెట్టుబడులకు యూఎస్ స్టాక్స్ వీలు కలి్పస్తాయని పేర్కొంది. ఆర్‌బీఐ అనుమతించిన ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా మార్గదర్శకాలకు లోబడి ఇందుకు అవకాశముంటుందని తెలియజేసింది.


