యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. బిల్లుకు లోక్‌సభ ఆమోదం | UPI Charges Lok Sabha Passes Bill MDR Digital Payments | Sakshi
Sakshi News home page

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Aug 6 2026 4:27 PM | Updated on Aug 6 2026 4:35 PM

UPI Charges Lok Sabha Passes Bill MDR Digital Payments

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులపై మర్చెంట్‌ డిస్కౌంట్‌ (MDR) విధించేందుకు వీలుగా నిబంధనలను మార్చే ట్యాక్సేషన్‌ చట్టాల (సవరణ) బిల్లు, 2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ప్రతి యూపీఐ చెల్లింపుపైనా ఛార్జీ పడుతుందని భావించాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై జీరో-ఎండీఆర్‌ విధానం అమల్లో ఉంది. డిజిటల్ చెల్లింపులను వేగంగా విస్తరించడంతో పాటు చిన్న వ్యాపారులు, వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఈ విధానం కొనసాగుతోంది. తాజా సవరణ ద్వారా కొన్ని రకాల యూపీఐ లావాదేవీలకు భవిష్యత్తులో ఎండీఆర్‌ విధించేలా చట్టపరమైన అడ్డంకిని తొలగించే అవకాశం ఏర్పడింది.

అయితే ఎంత ఛార్జీ విధించాలి, ఏ లావాదేవీలకు వర్తించాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలి వంటి అంశాలను బిల్లు ప్రస్తుతం నిర్దేశించలేదు. యూపీఐ వినియోగదారుల నుంచి నేరుగా ఫీజు వసూలు చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎంపిక చేసిన వ్యాపార చెల్లింపులపై ఎండీఆర్‌ విధించే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.

అందువల్ల సాధారణ యూపీఐ వినియోగదారులకు ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పు ఉండదు. భవిష్యత్తులో ప్రభుత్వం, ఆర్‌బీఐ నిర్ణయించే నిబంధనల ఆధారంగానే నిర్దిష్ట వ్యాపార లావాదేవీలపై ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిన్న వ్యాపారులు, తక్కువ విలువైన చెల్లింపులకు రక్షణ కల్పిస్తూ ఛార్జీల విధానాన్ని రూపొందించాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement