అక్టోబర్ గణాంకాలు విడుదల
సెప్టెంబర్‌లోనూ ఇదే స్థాయి
న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు అక్టోబర్‌లో 5.2 శాతం వద్దే కొనసాగింది. సెపె్టంబర్‌లోనూ 5.2 శాతంగా ఉండగా, ఆగస్ట్‌లో 5.1 శాతం, జూలైలో 5.2 శాతం, మే, జూన్‌లో 5.6 శాతం, ఏప్రిల్‌లో 5.1 శాతం వద్ద ఉండడం గమనార్హం. అక్టోబర్ నెలకు సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 15 ఏళ్ల వయసు పైబడిన వారికి సంబంధించిన గణాంకాలు ఇవి.
→ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం కాస్తంత తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్‌లో 4.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌లో 4.4 శాతానికి తగ్గింది.
→ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. నిరుద్యోగం రేటు సెపె్టంబర్‌లో ఉన్న 6.8 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది.
→ మొత్తం మీద 15 ఏళ్లు నిండిన మహిళల్లో
నిరుద్యోగం 5.5 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతం నుంచి 4 శాతానికి పరిమితమైంది.
→ పురుషులకు సంబంధించి నిరుద్యోగ రేటు అక్టోబర్‌లో 5.1 శాతం వద్ద స్థిరంగా ఉంది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం 4.7 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. అదే పట్టణాల్లో మాత్రం 6 శాతం నుంచి 6.1 శాతానికి పెరిగింది.
→ వర్కర్–పాపులేషన్ రేషియో (మొత్తం జనాభాలో ఉపాధి పొందుతున్న వారు) 52.5 శాతంగా ఉంది. మహిళల్లో వర్కర్ పాపులేషన్ రేషియో స్థిరంగా పెరుగుతూ వస్తోంది. జూన్‌లో ఇది 30.2 శాతంగా ఉంటే, అక్టోబర్‌లో 32.4 శాతానికి మెరుగుపడింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది జూన్‌లో 33.6 శాతంగా ఉంటే, అక్టోబర్ నాటికి 36.9 శాతానికి పెరిగింది.
→ లేబర్ ఫోర్స్ పారి్టసిపేషన్ రేట్ (ఎల్‌ఎఫ్‌పీఆర్) జూన్‌లో ఉన్న 54.2 శాతం నుంచి అక్టోబర్‌లో 55.4 శాతానికి మెరుగుపడింది.


