మీ పేరుతో సిమ్ కార్డు ఉందా.. జాగ్రత్త!
మన పేరుతో సిమ్ తీసుకోవడం, దాన్ని అవసరం లేనప్పుడు వేరే వ్యక్తికి ఇవ్వడం సాధారణంగానే అనిపిస్తుంది. కానీ.. ఇకపై ఈ విషయంలో తప్పకుండా కొంత జాగ్రత్త వహించాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం.. భారీ జరిమానా చెల్లించడంతో పాటు, మూడేళ్లు జైలుపాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొబైల్ రీఛార్జ్‌లపై కేంద్రం శుభవార్త
మొబైల్ రీఛార్జ్‌లపై కేంద్ర శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు చాలా టెలికాం కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో నెలకు ఒకసారి రీఛార్జ్ చేస్తున్నామని భావించే వినియోగదారులు ఏడాదిలో 12 సార్లు కాకుండా.. 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కొత్త వ్యాలిడిటీ ఆప్షన్లు అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జియో ఫ్రీ రీచార్జ్ ఆఫర్ గురించి తెలుసా?
కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే 6 నెలలు రీచార్జ్ ఉచితంగా పొందే అవకాశం ఉందని మీకు తెలుసా? కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే జియో వినియోగదారులకు రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా 2026 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రైల్వే టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు!
ట్రైన్ టికెట్ ఆన్‌లైన్‌లో బుక్ చేసి.. యూపీఐ ద్వారా పేమెంట్ చేసేవారు 2026 అక్టోబర్ 15 నుంచి ఓ కొత్త మార్పు గమనించనున్నారు. రూ.2000 కంటే ఎక్కువ విలువైన టికెట్ల విషయంలో ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ జోరు..
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాల జోరు కొంత మందగించింది. 2026 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో (Q3) దేశంలోని తొమ్మిది కీలక నగరాల్లో మొత్తం 1,03,170 ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 1,09,420 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 6 శాతం తగ్గాయి. అంతకుముందు త్రైమాసికంతో పోల్చినా విక్రయాలు 4 శాతం తగ్గినట్లు ఎన్‌ఎస్‌ఈ నమోదిత రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ విశ్లేషణ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


