
టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ కార్లును ఇప్పటివరకు 6,00,000 తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు తయారీ ప్రారంభించిన నాలుగు ఏళ్లలో ఈమేరకు గణనీయమైన ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. ఇండియాలోని కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఈ మోడల్ గేమ్ ఛేంజర్‌గా నిలిచినట్లు చెప్పింది.
‘అక్టోబర్ 2021లో లాంచ్ అయిన టాటా పంచ్ దాని డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, ఇతర ఫీచర్లతో త్వరగా వినియోగదారుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. టాటా ఆల్ఫా (ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్) ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన పంచ్ ఓ మోస్తారు ఎస్‌యూవీ వాహనాలు చూస్తున్న వారిని ఎంతో ఆకర్షించింది’ అని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: భారత్‌లోకి యూఎస్ జన్యుమార్పిడి పంటలు ఎంట్రీ?
2024 క్యాలెండర్ ఇయర్‌లో ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కారుగా టాటా పంచ్ నిలిచిందని సంస్థ పేర్కొంది. అమ్మకాల పరంగా మారుతీ సుజుకీ దశాబ్దాల ఆధిపత్యాన్ని అధిగమించినట్లు తెలిపింది. గత 40 ఏళ్లలో వార్షిక అమ్మకాల్లో మారుతీని తొలిసారి టాటా వెనక్కి నెట్టినట్లు చెప్పింది. ఇది ఐసీఈ, ఈవీ వెర్షన్‌ల్లో లభ్యం అవుతుంది.