టాటా ఏఐజీ నుంచి హెల్త్‌ సూపర్‌ చార్జ్‌ ప్లాన్‌ | Sakshi
Sakshi News home page

టాటా ఏఐజీ నుంచి హెల్త్‌ సూపర్‌ చార్జ్‌ ప్లాన్‌

Published Mon, Dec 4 2023 6:09 AM

Tata AIG introduces Health Supercharge offering enhanced - Sakshi

ముంబై: టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌.. ‘హెల్త్‌ సూపర్‌ చార్జ్‌’ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని కింద పాలసీదారులు ఐదు రెట్లు అధికంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని పొందొచ్చు. ఏటా 50 శాతం రెన్యువల్‌ బోనస్‌ చొప్పున గరిష్టంగా 500 శాతం (ఐదు రెట్లు) కవరేజీని పెంచుకోవచ్చు.

టైర్‌–1 నుంచి టైర్‌–4 వరకు పట్టణాల్లో నివసించే వారి భిన్న రకాల ఆరోగ్య సంరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్, సమ్‌ ఇన్సూర్డ్‌ అపరిమిత రీస్టోరేషన్‌ సదుపాయం, ముందు నుంచి ఉన్న వ్యాధుల వేచి ఉండే కాలాన్ని నాలుగేళ్ల నుంచి 30 రోజులకు తగ్గించుకునే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ కింద రూ.5–20 లక్షల కవరేజీని పొందొచ్చు. ఏటా ఉచిత హెల్త్‌ చెకప్‌ సదుపాయం కూడా ఉంది.

Advertisement
 
Advertisement